Simhachalam : సింహాద్రి అప్పన్నకు వందకోట్ల చెక్‌!

సింహాద్రి అప్పన్న స్వామివారికి ఓ భక్తుడు వంద కోట్ల చెక్‌ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కూడా షాక్‌ అయ్యారు. ఎందుకంటే..అంత పెద్ద మొత్తంలో ఉన్న చెక్‌ చెల్లుతుందా లేదా అనేది వారికి ఓ సందేహం అయితే..అసలు ఇంత పెద్ద మొత్తంలో స్వామి వారికి నగదు ఇచ్చే భక్తుడు ఎవరు అని.

New Update
Simhachalam : సింహాద్రి అప్పన్నకు వందకోట్ల చెక్‌!

Simhachalam Temple receives Rs. 100 Crore cheque: సింహాద్రి అప్పన్న స్వామివారికి ఓ భక్తుడు వంద కోట్ల చెక్‌ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కూడా షాక్‌ అయ్యారు. ఎందుకంటే..అంత పెద్ద మొత్తంలో ఉన్న చెక్‌ చెల్లుతుందా లేదా అనేది వారికి ఓ సందేహం అయితే..అసలు ఇంత పెద్ద మొత్తంలో స్వామి వారికి నగదు ఇచ్చే భక్తుడు ఎవరు అని.

ఇప్పటి వరకు తిరుమల వెంకటేశ్వరునికి మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం జరిగింది కానీ..సింహాద్రి అప్పన్నకు కాదు. విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయ హుండీలో బొడ్డేపల్లి రాధాకృష్ణ పేరుతో ఆ 100 కోట్ల రూపాయల చెక్ ఉంది. ఆ చెక్‌ శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి పేరుతో చెక్ ఉంది. దేవాలయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో చెక్ రావడం ఇదే ప్రథమం అంటున్నారు ఆలయ అధికారులు.

హుండీ లెక్కింపు సమయంలో చెక్‌ చూసిన సిబ్బంది మొదట కంగారు పడ్డారు.ఆలయ చరిత్రలోనే అత్యధిక మొత్తం స్వామివారికి కానుక రూపంలో వచ్చిందని సంబరపడ్డారు. అనంతరం చెక్ చెల్లుతుందా లేదా అనే అనుమానంతో పరిశీలన  కోసం ఆలయ ఈవోకు చూపించారు.

ఈవో చెక్‌ ను బ్యాంకుకు పంపగా..బ్యాంకు వారు చెప్పిన విషయం తెలిసి సిబ్బంది షాక్‌ అయ్యారు. ఎందుకంటే ఆ భక్తుని ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నాయంటూ బ్యాంక్ అధికారులు చెప్పడంతో సింహాచలం ఆలయ అధికారులు కంగుతున్నారు.

మరోవైపు భక్తుడు రాధాకృష్ణ అడ్రస్ వివరాలు కోరుతూ బ్యాంకుకు లేఖ రాయాలని దేవస్థానం వర్గాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దురుద్దేశ పూర్వకంగా చెక్ వేసినట్టు గుర్తిస్తే కనుక చెక్ బౌన్స్ కేసు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.

మొత్తానికి వంద కోట్లు వచ్చిందని సంబరపడేలోగా.. అసలు విషయం తెలిసీ కంగుతిన్నారు ఆలయ అధికారులు.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు