Kanpur: పూనమ్ పాండే దంపతులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా!?

సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించినట్లు నటించిన పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై ఫైజాన్ అన్సారీ అనే వ్యక్తి రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. పూనమ్ పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు.

New Update
Kanpur: పూనమ్ పాండే దంపతులపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా!?

Defamation: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే చిక్కుల్లో పడింది. ఇటీవల సర్వైకల్ క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియా వేదికగా స్వయంగా తన ఖాతా నుంచి వార్త పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఇష్యూపై రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ.. పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో సీపీ అఖిల్ కుమార్ ఈ కేసుపై పూనమ్ దంపతులను విచారణకు ఆదేశించారు.

ప్రజల మనోభావాలను దెబ్బతీసింది..
ఈ మేరకు సీపీ విచారణను ఫైల్ఖానా ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించగా.. ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నట్లు తెలిపారు. పూనమ్ పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు. ఆమె సజీవంగా ఉండి కూడా మరణ వార్త ప్రచారం చేయడం దారుణం అన్నారు. 'పూనమ్ చనిపోయిందని ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమాచారం మోడల్ యొక్క అధికారిక ఇన్ స్టా హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు. ఆమె యుపిలోని కాన్పూర్ నివాసి అని కూడా ప్రచారం జరిగింది. కానీ నిజానికి ఆమె ముంబైలో పుట్టి అక్కడే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా ముంబై వాసులే' అని పైజాన్ తెలిపారు.

ఇది కూడా చదవండి : Bold care: పోర్న్ స్టార్ తో రణ్ వీర్.. శృంగారం ఇలా ఆస్వాదించాలంటూ వీడియో

ఒకరి జీవితంతో ఆడుకోవడమే..
ఇక గతంలోనూ ముంబైలో ఉర్ఫీ జావేద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫైజాన్ అన్సారీనే ఇప్పుడు పూనమ్ పాండే మీద పరువు నష్టం దావా వేశారు. తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. భారత్‌ ప్రపంచకప్‌ గెలిస్తే బట్టలు విప్పి మైదానంలోకి పరుగెత్తుతానని ఆమె కొంతకాలం క్రితం ప్రకటన ఇచ్చిన విషయం తెలసిందే. కాగా పబ్లిక్ గా ఒకరి జీవితంతో ఆడుకోవడం లేదా ఒకరి భావాలతో ఆడుకోవడం తప్పు, ఈ విషయంలో ఆమె బుద్ధి చెప్పాలనే నేను కాన్పూర్ వచ్చానని ఆయన స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు