Anantapur : గతంలో ఎన్నడు లేని విధంగా పుట్టపర్తి(Puttaparthi) లో రౌడీ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ(YCP) లో వర్గ పోరు.. ఆస్తులు, విగ్రహాలు ధ్వంసం చేసే వరకు చేరుకుంది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రశాంతంగా ఉంటున్న పుట్టపర్తిలో ప్రస్తుతం రౌడీయిజం పరాకాష్టకు చేరుకుంటోంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి(MLA Sreedhar Reddy) కి టికెట్ ఇవ్వకూడదని నల్లమాడలో నిర్వహించిన సమావేశానికి నాయకత్వం వహించిన వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి(Locherla Vijay Bhaskar Reddy) లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు.
Also Read: ఏపీలో బీజేపీ మూడు ముక్కలాట
శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Sri Satya Sai Super Specialty Hospital) సమీపంలో ఏర్పాటు చేసిన లోచర్ల పెద్దారెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే ధ్వంసం చేసి అక్కడ నుంచి తీసుకెళ్లిపోయారు. రాజకీయంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకించినప్పటి నుంచి నన్ను ఏదో ఒక విధంగా మానసికంగా దెబ్బ కొట్టాలని ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి మండిపడ్డారు. పుట్టపర్తిలో ఎన్నడూ లేని వీసా సంస్కృతికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నాంది పలకారని, ఇటువంటి దాడులు ఆస్తుల ధ్వంసం ఘటనలతో ప్రజలకు ఆయన ఏం మెసేజ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి విష సంస్కృతి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పతనం నేటితోనే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.
Also Read: జీవిత ఖైదు అంటే జీవితాంతం జైల్లో ఉండాలా..? సుప్రీంకోర్టులో పిటిషన్
ఉడత ఊపులకు బుడ్డ బెదిరింపులకు భయపడబోనని హెచ్చరించారు. ఇది పిరికిపంద చర్యని ప్రజాస్వామ్యబద్ధంగా డైరెక్ట్ గా తనని ఎదుర్కొనలేక శ్రీధర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నాడని లోచర్ల విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. మీ రౌడీజానికి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు తాడోపేడో తేల్చుకోవడానికి మేము సిద్ధమని.. మీ రౌడీయిజాన్ని, భూ దందాలు, భూ అక్రమాలు, అవినీతిని బయటపెట్టి తీరుతామంటూ విజయ భాస్కర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా జరిగిన ఈ పరిణామం వైసీపీలో ఏ ఉపద్రవం తీసుకురానుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.