/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/revanth-kcr-jpg.webp)
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి(Revanth Reddy) రేపు(డిసెంబర్ 7)ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. సీనియర్లను బుజ్జగించిన కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించింది. తెలంగాణ ఎన్నికల్లో 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్‌పై కన్నేసిన కేసీఆర్ పార్టీకి చెక్ పెడుతూ విక్టరీ సాధించడానికి అనేక కారణాలు ఉండగా.. అందులో రేవంత్‌రెడ్డి కూడా ఒక కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. అటు నేషనల్‌మీడియా సైతం రేవంత్‌రెడ్డి గురించి అనేక కథనాలు అల్లుతోంది. ఇదే సమయంలో రేవంత్‌రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలో రేవంత్ కామెంట్స్‌ను తప్పుపడుతూ బీజేపీ నేతలు, సోషల్‌మీడియా యూజర్లు ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు.
రేవంత్ ఏం అన్నారంటే:
ఇండియా టుడే కాన్‌క్లేవ్(INDIA TODAY Conclave)లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కంటే తానే గొప్పవాడని చెప్పుకునే ప్రయత్నంలో రేవంత్ రెసిస్ట్(Racist) వ్యాఖ్యలు చేశారని బీజేపీ మండిపడుతోంది. కేసీఆర్‌పై విమర్శల దాడి చేస్తూ, ఆయన్ను బీహార్‌కు చెందిన కుర్మీ డీఎన్‌ఏ వ్యక్తిగా అభివర్ణించారు రేవంత్. 'కేసీఆర్ డీఎన్‌ఏ బీహార్‌కు చెందినది, కేసీఆర్ కులం కుర్మీ, కుర్మీలు బీహార్‌కు చెందిన వారు, బీహార్ నుంచి విజయనగరం, అక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చారు. నా డీఎన్‌ఏ తెలంగాణ, బీహార్ డీఎన్‌ఏ కంటే తెలంగాణ డీఎన్‌ఏ గొప్పది' అని కామెంట్స్ చేశారు రేవంత్.
Meet Revanth Reddy, Congress’s CM elect, who thinks KCR is of inferior DNA, presumably because he is a Kurmi from Bihar, who migrated to Telangana…
Nitish Kumar, a Kurmi, and part of the I.N.D.I Alliance, should ask the Congress to clarify if they think he is of inferior DNA? pic.twitter.com/vNCITkN5Va
— Amit Malviya (@amitmalviya) December 5, 2023
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా కాంగ్రెస్‌లోనే ఉంటారా అని ఆ కమల పార్టీ నేతలు సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇది ఎన్నికలకు ముందు మాట్లాడిన మాటలు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా దీనికి సంబంధించిన ఓల్డ్ వీడియోను తాజాగా పోస్ట్ చేయడంతో మరోసారి దుమారం చెలరేగింది. ఓ రాష్ట్రాన్ని తక్కువ చేసే మాట్లాడే తెలంగాణ సీఎం ఇతనే అంటూ కొందరు ట్వీట్లు చేస్తున్నారు.
Also Read: అగ్రకులాలదే పెత్తనం.. 52శాతం ఎమ్యెల్యేలు వారే..! బీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంతంటే?
WATCH: