CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా? ఢిల్లీ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఈడీ.. హైకోర్టును ఆశ్రయించగా ఆయన బెయిల్ నిలిచిపోయింది. By V.J Reddy 25 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి CM Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఈడీ.. హైకోర్టును ఆశ్రయించగా ఆయన బెయిల్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఈడీ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. అయితే హైకోర్టు కేజ్రీవాల్ బెయిన్ నిలిపివేయడంతో.. ఆయన సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తాము మధ్యంతర స్టే విషయంలో జోక్యం చేసుకోమని.. హైకోర్టు తుది తీర్పు తర్వాతే దీనిపై విచారిస్తామని పేర్కొంది. ఇక ఈరోజు బెయిల్‌పై తీర్పు రానుండటంతో ఆప్ పార్టీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. #cm-kejriwal సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి