AP: నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ.. 3 లక్షల మందికి..! నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 18వందల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. By Jyoshna Sappogula 17 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nellore Rottela Panduga: నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభమైంది. బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజుకు 3 లక్షల మందికి సరిపడా అరేంజ్ మెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 18వందల మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రొట్టెల పండుగ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ రూల్స్ విధించారు. Also Read: శ్రీకాకుళం జవాన్ రాజేష్ వీరమరణం.. మూడు నెలల్లో వచ్చి పెళ్ళి చేసుకుంటానని.. తొలిరోజు కర్ణాటక, చెన్నై, ఛత్తీస్ గఢ్ నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భక్తులు ఒక్కో కోరికకు ఒక్కో రొట్టెను సమర్పిస్తున్నారు. ఏటా మొహర్రం సందర్భంగా నెల్లూరులో ఈ రొట్టెల పండుగ జరుపుతారు. 5 రోజుల పాటు జరుగనున్న ఈ పండుగను రాష్ట్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. #rottela-panduga #nellore #ap-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి