Copper Roti: చలి నుంచి కాపాడే రోటీ.. కీళ్ల నొప్పులు సైతం మాయం

శీతాకాలంలో ఎముకల సమస్యలతో అనేక మంది బాధపడుతుంటారు. ఈ సమస్య పరిష్కారానికి గోధుమలకు బదులుగా రాగిపిండితో చేసిన రోటీలను తినాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఎముకలు దృఢంగా అయి నొప్పులు తగ్గుతాయని వివరిస్తున్నారు.

New Update
Copper Roti: చలి నుంచి కాపాడే రోటీ.. కీళ్ల నొప్పులు సైతం మాయం

Copper Roti: శీతాకాలంలో ఎముకలపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ సీజన్‌లో.. ఎంతోమంది ఎముకలలో నొప్పి, అసౌకర్యంతో ఉంటారు. కొన్ని సందర్భల్లో లేవడం, కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. బలహీనమైన ఎముకలు ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారితీస్తాయి. అయితే.. ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. ఆహారంలో గోధుమలకు బదులుగా రాగుల పిండితో చేసిన రోటీలను తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు వంటి పోషకాలు రాగుల్లో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తుంది. రాగి పిండితో చేసిన రోటీ తింటే విపరీతమైన చలిలో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని తినడం వల్ల ఈ వ్యాధులు కూడా నయమవుతాయి. దీన్ని ఎలా తినాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రాగి రోటీ వలన ప్రయోజనాలు

ఎముకలు దృఢంగా : శీతాకాలంలో ఎముకల నొప్పి రాకుండా ఉండాలంటే రాగి రోటీలు తినాలి. ఇందులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. 100 గ్రాముల రాగిలో 344 mg కాల్షియం పుష్కలంగా అందుతుంది.

చర్మాన్ని మెరుగు: రాగులు యాంటీ ఏజింగ్‌గా పని చేస్తాయి. దీన్ని తింటే అనేక చర్మ సంబంధిత ప్రయోజనాలను పొందుతారు. వీటిల్లో మెథియోనిన్, లైసిన్ వంటి ముఖ్యమైన అమైనో యాసిడ్ ఎలిమెంట్స్ చర్మానికి అద్భుతంగా పని చేస్తాయి.

బరువుకు చెక్‌: చాలా మంది బరువు తగ్గడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూంటారు. అలాంటి వారు ఆహారంలో రాగులను ఖచ్చితంగా చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గుతారు. వీటిల్లో ఫైబర్, పీచుపదార్థం అధికం.

రక్తహీనతలో మేలు: శరీరంలో రక్తం తక్కువగా ఉంటే..రాగులను ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తహీనత రోగులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి.

చక్కెరను తగ్గించండి: రాగులను ఏ రూపంలో తీసుకున్నా..శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది. దీని కారణంగా.. చాలా తరచుగా ఆకలి అవ్వదు. బరువు పెరుగుట సమస్య నుంచి దూరం అవుతుంది.

ఇది కూడా చదవండి:  జీలకర్ర, మెంతితో ఎంతటి బరువైనా తగ్గాల్సిందే..ఎలా వాడాలంటే..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ గింజలు తింటే కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతాయి..గుండెపోటు నుంచి రక్షణ

Advertisment
తాజా కథనాలు