Rohit sharma: ట్రోఫీ పక్కలో పెట్టుకుని పడుకున్న రోహిత్.. పోస్ట్ వైరల్!

భారత కెప్టెన్ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ పక్కలో పెట్టుకుని పడుకున్నాడు. బార్బడోస్‌లోని హోటల్ గదిలో మార్నింగ్ ట్రోఫీతోనే నిద్రలేచినట్లు చూపిస్తూ పోస్ట్ పెట్టాడు. ఇండియాకు ఎప్పుడొస్తున్నారు. ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

New Update
Rohit sharma: ట్రోఫీ పక్కలో పెట్టుకుని పడుకున్న రోహిత్.. పోస్ట్ వైరల్!

T20 World Cup: భారత కెప్టెన్ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీ పక్కలో పెట్టుకుని పడుకున్నాడు. బార్బడోస్‌లోని హోటల్ గదిలో మార్నింగ్ ట్రోఫీతోనే నిద్రలేచినట్లు చూపిస్తూ పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పుడు మాకు గర్వంగా ఉందంటూ మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండియా ఎప్పుడొస్తున్నారు. ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంబరపడిపోతున్నారు.

ఏకైక ఆటగాడు..
ఇక టీ20 ఫార్మెట్‌ విషయానికే వస్తే అత్యధిక వ్యక్తిగత పరుగులు (4,231), అత్యధిక సెంచరీలు (5), అత్యధిక సిక్సర్ల (205) రికార్డులు రోహిత్ పేరేమీదే ఉన్నాయి. ఇండియా గెలిచిన రెండు టీ20 ప్రపంచకప్‌ల్లోనూ భాగస్వామ్యం పంచుకున్న ఏకైక ఆటగాడు రోహితే. మొత్తం 9 టీ20 వరల్డ్‌కప్‌లు ఆడిన ఏకైక ఆటగాడు. టెస్టులు, వన్టేలు, టీ20 ల్లోనూ అత్యధిక సిక్సర్లు (612) కొట్టిన ఏకైక ఆటగాడు హిట్ మ్యానే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు