2021 టీ20 ప్రపంచకప్‌కు ముందు విరాట్ కోహ్లీ టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. పనిభారం కారణంగా కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీని తర్వాత విరాట్ నెల రోజుల్లోనే వన్డే, టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు.
కాగా, 2021-22 దక్షిణాఫ్రికా టూర్‌కు జట్టు ఎంపిక సమావేశానికి 90 నిమిషాల ముందు తనను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు తనకు చెప్పారని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ నిర్ణయం గురించి తమకు చాలా ముందుగానే తెలియజేశామని బీసీసీఐ చేసిన వాదనను అతను పూర్తిగా తోసిపుచ్చాడు.
తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరఫ్ గంగూలీ రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించడంపై విమర్శలు ఎదుర్కొన్న సమయాన్ని గుర్తు చేసుకున్నాడు. , 'నేను భారత జట్టు కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించినప్పుడు, అందరూ నన్ను విమర్శించారు. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోవడంతో అందరూ నన్ను విమర్శించటం మానేశారు. నిజానికి అతడిని భారత జట్టుకు కెప్టెన్‌గా నియమించింది నేనే అన్న విషయం అందరూ మర్చిపోయారని అనుకుంటున్నాను.
దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను కోల్పోయిన భారత టెస్టు కెప్టెన్‌గా కోహ్లి రాజీనామా చేశాడు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కోహ్లిని బలవంతంగా తప్పుకున్నందుకు కూడా కొందరు అతనిని తప్పుపట్టారు. అయితే కోహ్లి స్థానంలో అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని చేపట్టిన రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆ యుగం ఇప్పుడు గతానికి సంబంధించినదిగా కనిపిస్తోంది.