Rohit Sharma Birthday: క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన హిట్‌మ్యాన్.. 

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఏప్రిల్ 30, 1987న పుట్టాడు రోహిత్ శర్మ. గురునాథ్ శర్మ- పూర్ణిమ శర్మలకు జన్మించిన రోహిత్ చిన్నతనంలోనే క్రికెట్‌ అంటే పిచ్చిగా ఉండేవాడు. హిట్ మ్యాన్ గురించి ఆసక్తికర విషయాల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

Rohit Sharma Birthday: క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన హిట్‌మ్యాన్.. 
New Update

Rohit Sharma Birthday: మన దేశంలో క్రికెట్ అంటే ఏదో ఒక ఆట మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. అది గల్లీ క్రికెట్ అయినా లేదా ప్రొఫెషనల్ టోర్నమెంట్ అయినా, ఎప్పుడూ ఉత్కంఠతో కూడిన ఫీవర్ పిచ్ ఉంటుంది. ఇక క్రికెట్ ఆడేవాళ్లని అభిమానులు దేవుడితో సమానంగా చూడటం మన దేశంలో తరచూ కనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే.. క్రికెట్ మనదేశంలో ఒక మతంగా చెప్పుకోవచ్చు. మనదేశంలో ఎంతో మంది ఆటగాళ్లు తమ ఆటతీరుతో ప్రపంచ క్రికెట్ లో మన జట్టుని ఒక రేంజ్ లో నిలబెట్టారు. అలాగే, ఎంతోమంది ఆటగాళ్లు తమ ఆటతీరుతో పాటు తమ వ్యవహార శైలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. క్రికెట్ ఆటలో ఎవరి స్టైల్ లో వారు ఆడినా.. భారత పతాకాన్ని ప్రపంచ క్రికెట్ వినీలాకాశంలో రెపరెపలాడేలా చేశారు.. చేస్తున్నారు. ప్రస్తుతం అటువంటి ఆటగాళ్లలో టాప్ ప్లేస్ లో ఉన్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఆట.. మాట.. వ్యవహారశైలితో ప్రపంచ క్రికెట్ అభిమానుల్లో  ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. 

రోహిత్ శర్మ(Rohit Sharma Birthday) ఈ పేరు వినగానే ప్రతి క్రికెట్ అభిమాని పొంగిపోతాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే, భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ రికార్డుల వెల్లువ అలాంటింది. ధోనీ.. కోహ్లీ వంటి అత్యంత ఆకర్షణ కలిగిన క్రికెటర్ల మధ్యలో తన ఆట తీరుతోనే అభిమానగణాన్ని పోగేసుకున్న విలక్షణత రోహిత్ సొంతం. బ్యాటింగ్ స్టైల్.. కెప్టెన్ గా వ్యూహాచతురత.. రోహిత్ శర్మ(Rohit Sharma Birthday)ను సమకాలీన క్రికెట్ లో ఉన్నతస్థానంలోకి చేర్చాయి. ఈరోజు అంటే ఏప్రిల్ 30 రోహిత్ శర్మ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఈ హిట్ మ్యాన్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. 

పరిచయం అవసరం లేని పేరు..

రోహిత్ శర్మ(Rohit Sharma Birthday) అంటే.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు.  మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఏప్రిల్ 30, 1987న జన్మించిన రోహిత్ శర్మ అసలు పేరు రోహిత్ గురునాథ్ శర్మ. గురునాథ్ శర్మ (ఇతను రవాణా సంస్థ స్టోర్‌హౌస్‌లో కేర్‌టేకర్‌గా పనిచేశాడు) - పూర్ణిమ శర్మలకు జన్మించిన రోహిత్ చిన్నతనంలోనే క్రికెట్‌ అంటే పిచ్చిగా ఉండేవాడు. చిన్నతనంలోనే క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. 

1999లో, ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రోహిత్ మామ అతన్ని క్రికెట్ క్యాంప్‌లో చేర్చాడు. క్యాంప్ కోచ్ అయిన దినేష్ లాడ్ రోహిత్‌ని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్, ముంబైకి మార్చమని సూచించారు. ఎందుకంటే ఆ పాఠశాలలో క్రికెట్ శిక్షణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. అంతేకాకుండా అతను అక్కడ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అలాగే, దినేష్ లాడ్ రోహిత్‌కు కోచింగ్ ఫీజు తీసుకోకుండా శిక్షణ ఇచ్చాడు. ఇది శర్మ క్రికెట్ నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడింది. 

దేశీ క్రికెట్ ఆరంగేట్రం..

రోహిత్(Rohit Sharma Birthday) తన తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించి మనదేశ క్రికెట్ కు మరో ఆణిముత్యం రాబోతోంది అనే సంకేతాల్ని ఇచ్చాడు. రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ కెరీర్ మార్చి 2005 లో వెస్ట్ జోన్ తరపున దేవధర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో లిస్ట్ A అరంగేట్రం చేయడంతో ప్రారంభమైంది . ఈ టోర్నమెంట్‌లో అతను ఉదయపూర్‌లో నార్త్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 123 బంతుల్లో 142 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌ను సాధించాడు.

Also Read: టీ20 వరల్డ్ కప్ కు ఈ ముగ్గురు యంగ్‌స్టర్స్‌కు జట్టులో పక్కా..!

భారత్ జట్టులోకి ఎంట్రీ..

రోహిత్ శర్మ(Rohit Sharma Birthday) 2007లో ఐర్లాండ్‌పై భారత జట్టుకు అరంగేట్రం చేశాడు . ఆరంభం అంతగా లేకపోయినా.. అనతికాలంలోనే అద్భుతమైన బ్యాటింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతను 2013లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించడం ద్వారా భారత క్రికెట్ లో స్దాన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అలా చేసిన మూడవ ఆటగాడిగా అతను రికార్డ్ సృష్టించాడు. 

ఐపీఎల్ కింగ్.. 

అతను 2008 లో డెక్కన్ ఛార్జర్స్ తరపున IPL లో అరంగేట్రం చేసాడు.  తరువాత 2011 లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు . అతను 2013, 2015, 2017, 2019 - 2020 తో సహా పలు సంవత్సరాల్లో ముంబై ఇండియన్స్‌ను విజయపథంలో నడిపిస్తూ విజయవంతమైన కెప్టెన్‌గా ఉన్నాడు.

హిట్‌మ్యాన్..

రోహిత్(Rohit Sharma Birthday) బ్యాటింగ్ శైలి చాలా మనోహరంగా ఉంటుంది. అతను సిక్సర్లు కొట్టే తన స్టైల్ తో అభిమానుల మనస్సులో "హిట్‌మ్యాన్"గా స్థానం సంపాదించుకున్నాడు.  క్రికెట్ గ్రౌండ్ లో అయినా.. బయట అయినా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడంలో రోహిత్ శర్మది ప్రత్యేక శైలి. ఇది అతన్ని భారత క్రికెట్ జట్టు - ముంబై ఇండియన్స్ రెండింటికీ కీలకమైన ఆటగాడిగా నిలబెట్టింది. 

రోహిత్ శర్మ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు..

రోహిత్‌ను ఎప్పుడూ టెస్టు క్రికెటర్‌గా పరిగణించలేదు. అతని నిలకడలేని ప్రదర్శన అతనిని టెస్ట్ జట్టు నుండి తప్పించడానికి దారితీసింది. కానీ తరువాత 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో, అతను ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న మొట్టమొదటి భారత జట్టులో భాగమయ్యాడు.

  1. కెప్టెన్‌గా టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక భారతీయుడు రోహిత్ శర్మ 
  2. 2013లో సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు అదే సిరీస్‌లో వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అతను తన తొలి మ్యాచ్‌లో 177 పరుగులు చేశాడు!
  3. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ 597 సిక్సర్లు కొట్టాడు .
  4. రోహిత్ శర్మ వన్డేల్లో 31 సెంచరీలు సాధించాడు. దీంతో విరాట్ కోహ్లీ (50), సచిన్ టెండూల్కర్ (49) తర్వాతి స్థానంలో నిలిచాడు. 
  5. రోహిత్ గురించి మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే.. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా తన కెరీర్ నిలబెట్టుకున్న రోహిత్ నిజానికి ఆఫ్ స్పిన్నర్ బౌలర్.
  6. భారత జాతీయ జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ 23 జూన్ 2007న బెల్ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారతదేశం తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్ లో ఏడో నెంబర్ బ్యాట్స్ మెన్ గా ఉండడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే, భారత్ ఆ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
  7. 2019 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ తన 2,000వ పరుగును.. అదేవిధంగా మొదటి డబుల్ సెంచరీని సాధించాడు .
  8. సురేశ్ రైనా తర్వాత, మొత్తం 3 అంతర్జాతీయ ఫార్మాట్లలో కనీసం సెంచరీ సాధించిన 2వ భారతీయుడుగా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. 
  9. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ (ODI)లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264రోహిత్ శర్మదే. 
  10.  వన్డే ఇంటర్నేషనల్స్‌లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్‌మెన్. ఆ వివరాలివే.. 
బెంగళూరులో తొలి డబుల్ సెంచరీ 158 బంతుల్లో 209 పరుగులు  ఆస్ట్రేలియా
ఈడెన్ గార్డెన్స్‌లో 2వ డబుల్ సెంచరీ 173 బంతుల్లో 264 పరుగులు  శ్రీలంక
చండీగఢ్‌లో 3వ డబుల్ సెంచరీ 153 బంతుల్లో 208 పరుగులు శ్రీలంక
  • భారత ఓపెనర్ నవంబర్ 2007లో పాకిస్తాన్‌పై ODIలో తన మొదటి అర్ధ సెంచరీని సాధించాడు . తర్వాత, 2009లో రంజీలో అతని ట్రిపుల్ సెంచరీతో అతను 2010లో ODI జట్టులోకి తిరిగి వచ్చాడు.
  • శ్రీలంకతో.. 
    • 13 నవంబర్ 2014న కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన ODI మ్యాచ్‌లో అతను ODIలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264 పరుగులు) చేశాడు.
    • అతను 13 డిసెంబర్ 2017న మొహాలీలో శ్రీలంకపై 209 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో మూడు డబుల్ సెంచరీలతో మొదటి ఆటగాడిగా నిలిచాడు.
    • 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో 2442 పరుగులు చేసిన తర్వాత, అతను 1997లో శ్రీలంక తరఫున సనత్ జయసూర్య చేసిన 2387 పరుగులను అధిగమించాడు.

రోహిత్ శర్మ సాధించిన అవార్డులివే..

  • 2012-13లో  దిలీప్ సర్దేశాయ్ అవార్డ్ బెస్ట్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్
  • 2014లో ప్రపంచ రికార్డు వన్డే స్కోరు 264 సాధించినందుకు బీసీసీఐ ప్రత్యేక అవార్డు
  • 2015లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు
  • 2016లో CEAT ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్
  • 2014, 2016, 2017, 2018లలో ICC ODI టీమ్ ఆఫ్ ద ఇయర్
  • 2019లో ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ నుండి స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
  • 2019లో ICC క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసినందుకు గోల్డెన్ బ్యాట్ అవార్డును అందుకున్న మూడవ భారతీయ బ్యాట్స్‌మెన్‌. 
  • 2020లో దేశంలోనే అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు

రోహిత్ శర్మ ప్రతిభ, కృషి-అంకితభావం కలగలిపిన అపూర్వ క్రికెటర్. క్రికెట్‌ను ఇష్టపడే యువకుడి నుండి ప్రపంచ స్థాయి ప్రసిద్ధ బ్యాట్స్‌మెన్‌గా అతని ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం.

#rohit-sharma #team-india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe