/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Rohit-Record.png)
Rohit Sharma Most Sixes Record: ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్ల ముందు అనేక రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి. వాటిలో ఒకటి అత్యధిక సిక్స్ ల రికార్డ్. అది చేయాల్సింది రోహిత్ (Rohit Sharma).. ఇలా బ్యాటింగ్ కు వచ్చాడో లేదో.. అలా మొదలు పెట్టేశాడు రోహిత్. సిక్సర్ల రికార్డు కొట్టాల్సిందే అనేంత కసిగా వరుసగా మూడో సిక్స్ కొట్టేశాడు. రికార్డ్ పట్టేశాడు.
దీంతో ఆ జట్టు 4.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఉన్నారు.
Also Read: కింగ్ కోహ్లి ఈరోజు ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా?
ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ తన మూడో సిక్స్ కొట్టడం ద్వారా వన్డే ప్రపంచకప్‌లో (World Cup) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో రోహిత్ పేరిట 50 సిక్సర్లు ఉన్నాయి. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (49 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. రోహిత్‌కి ఇది మూడో ప్రపంచకప్. దీనికి ముందు, అతను 2015 - 2019 ODI ప్రపంచకప్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు.
భారత్-న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ రికార్డులు
- ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ ప్రపంచకప్ పవర్‌ప్లేలో అతను 19 సిక్సర్లు కొట్టాడు. కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ రికార్డును రోహిత్ వదిలేశాడు. 2015 ప్రపంచకప్‌లో పవర్‌ప్లే సమయంలో మెకల్లమ్ 17 సిక్సర్లు కొట్టాడు.
- ప్రస్తుత ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ సీజన్‌లో 28 సిక్సర్లు కొట్టాడు. గత మ్యాచ్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ 22 సిక్సర్ల రికార్డును రోహిత్ వదిలిపెట్టాడు.
ఇప్పుడిప్పుడే అట మొదలైంది. మరి చివరికి వచ్చేసరికి టీమిండియా ఎన్ని రికార్డులు మూటగట్టుకుంటుందో అంటూ భారత్ క్రికెట్ అభిమానులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.