Rohini panel report: బీజేపీ మరో అస్త్రం! OBC రిజర్వేషన్లలో భారీ మార్పులు? కాంగ్రెస్‌ని డిఫెన్స్‌లో పడేసేందుకు బీజేపీ మరో అస్త్రంతో సిద్ధమైంది. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరగనున్న పార్లమెంట్ సమావేశాలకు ముందు ఓబీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఓబీసీ(OBC) రిజర్వేషన్లలో మార్పులు తీసుకురానుందని సమాచారం. ఓబీసీ ఉప వర్గీకరణకు సంబంధించి జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జూలైలో సమర్పించారు. By Trinath 07 Sep 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Rohini panel report before parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల(parliament special session) ప్రకటించిన రోజు నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక అంశలపై విపరీత చర్చ జరుగుతోంది. కులాలు, మతాలు, ఎన్నికలు, ప్రాంతాల విషయాలపై బీజేపీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. జస్టిస్ రోహిణి ఓబీసీ(OBC) రిజర్వేషన్లలో భారీ మార్పులు తెచ్చేందుకు బీజేపీ రెడీ ఐనట్టు సమాచారం. ఇటీవలే కేంద్రానికి జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్(Rohini commission report) ఇవ్వగా రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం OBCలకు 27 శాతం రిజర్వేషన్లు ఉండగా..ఈ పంపిణీలో సమూల మార్పులు చేసేందుకు ఎన్డీఏ సిద్దమైనట్టు సమాచారం. రోహిణి కమిషన్ గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆర్టికల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్, రాజ్యాంగం నుంచి 'ఇండియా' అనే పేరు తొలగింపు లాంటి బిల్లులను ప్రవేశపెట్టేందుకు బీజేపీ నిర్ణయించుకుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో ఓబీసీ రిజర్వేషన్లపై మోదీ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టానుందన్న న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ఇలా ఎన్నికలకు కొద్ది నెలల ముందు బీజేపీ వరుస పెట్టి బిల్లులు పెట్టడంతో కేంద్రం తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికలలో ఈ బిల్లు ట్రంప్ కార్డ్. రోహిణి నివేదిక దేశంలోని మొత్తం ఓటర్లలో 40 శాతానికి పైగా, అంటే OBC ఓటర్ల భవిష్యత్తుకు సంబంధించినది. ఇది తీవ్ర చర్చనీయాంశమైన రాజకీయ అంశంగా మారడం ఖాయం. 1.Justice Rohini Commission - sub categorisation of OBC 2. Article 340 3. 102nd CAA -Article 338B pic.twitter.com/XJznHlQlJl — Saquib Rahman (@saquib06012) April 13, 2023 2017లో ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కి మూడు ప్రాథమిక లక్ష్యాలు ఉన్నాయి. ➊ అన్ని ఇతర వెనుకబడిన కులాలను (OBCలు) గుర్తించడం, వాటిని ఉప-వర్గాలుగా వర్గీకరించడం. ➋ దాదాపు 3,000 కులాలను కలిగి ఉన్న OBCలోని వివిధ కులాలు, వర్గాల మధ్య ఉన్న అసమానతలను రిజర్వేషన్ విధానాల ద్వారా లబ్ది పొందే విషయంలో దర్యాప్తు చేయడం. ➌ OBCల మధ్య ప్రయోజనాల న్యాయమైన పంపిణీకి సంబంధించిన పద్ధతి, ఆధారం, ప్రమాణాలను రూపొందించడం. నాడు బీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పించిన మండల్ కమిషన్ ఎందుకీ కమిషన్: రోహిణి కమిషన్‌ను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ దేశంలోని ఓబీసీ ఓటర్లు గణనీయంగా ఉండడమే. OBC వర్గం వేలాది కులాలు, ఉప కులాలను కలిగి ఉంది. వాటిలో కొన్ని రిజర్వేషన్ల నుంచి గణనీయంగా ప్రయోజనం పొందాయి. మరికొన్ని వారి పరిమిత ఆర్థిక, విద్యా, సామాజిక స్థితి కారణంగా అట్టడుగున ఉండిపోయాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఇప్పటివరకు రెండు కమీషన్లు మాత్రమే స్థాపించారు. మొదటిది కాలేల్కర్ కమిషన్, రెండోది రోహిణి కమిషన్. మండల్ కమిషన్ కాలేల్కర్ కమిషన్‌ను అనుసరించిం. దాని సిఫార్సుల ఆధారంగా దేశంలోని 52 శాతం ఉన్న OBC జనాభాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో 27 శాతం రిజర్వేషన్లు మంజూరు చేశారు. బీసీ జనాభా ఎక్కువ: దేశంలోని మొత్తం ఓటర్లలో 40 శాతం కంటే ఎక్కువ మంది OBC వర్గానికి చెందినవారు ఉన్నారు. అగ్రవర్గాలతో పాటు గత ఎన్నికల్లో ఓబీసీ ఓటు బ్యాంకు మద్దతును కూడా బీజేపీ దక్కించుకుంది. 1990వ దశకంలో, మండల్ కమీషన్ ప్రభావంతో బీజేపీ పోరాడాల్సి వచ్చింది. ఆ తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఏర్పాటు, విజయంలో OBC ఓట్లు కీలక పాత్ర పోషించాయి. ఓబీసీలను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ఈ కొత్త ప్లాన్ వేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బీసీలు బీజేపీ వైపే ఉన్నారు. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్నవారు ఈ కమ్యూనిటీలో ఎక్కువగా కనిపిస్తారు. Rohini Commission constituted to examine sub-categorisation of OBCs has submitted its report to President on 1.8.2023 !#Reservation — Arvind Gunasekar (@arvindgunasekar) August 31, 2023 జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక వివరాలు: సుమారు 1,100 పేజీల నివేదికలో వివరించిన సిఫార్సులు రెండు భాగాలుగా విభజించారు. నివేదిక మొదటి భాగం OBC రిజర్వేషన్ కోటా సమానమైన, సమ్మిళిత పంపిణీకి సంబంధించినది. రెండో భాగం దేశంలో ప్రస్తుతం జాబితాలో ఉన్న 2,633 వెనుకబడిన కులాల గుర్తింపు, జనాభాలో వారి ప్రాతినిధ్యం గురించి డేటా సేకరించారు. మండల్ కమిషన్ కు మద్దతుగా 1990 ఆగస్టులో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన మాజీ ప్రధాని వీపీ సింగ్..(Image source/HT) ఇప్పటివరకు రిజర్వేషన్ విధానాల నుంచి వారు పొందిన ప్రయోజనాలకు సంబంధించిన డేటాపై ఈ రెండో భాగంలో పొందుపరిచారు. ఈ నివేదిక నాలుగు దశాబ్దాలుగా అమలులో ఉన్న OBC రిజర్వేషన్ విధానం అమలులో గణనీయమైన మార్పులను తీసుకురాగలదు. వివిధ కులాలు, ఉప కులాలను వర్గీకరించడం వెనుక ఉద్దేశం వారిని సమాన హోదాలో ఉంచడం. దీని ద్వారా అందరికీ సమాన అవకాశాలను కల్పించడం అని కమిషన్ ఇప్పటికే అనేకసార్లు చెప్పింది. ALSO READ: మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్.. సనాతన ధర్మాన్ని హెచ్‌ఐవీతో పోల్చిన రాజా! #parliament-special-session #justice-rohini-panel-on-obc-sub-categorisation #rohini-panel-report #rohini-commission #rohini-panel-report-on-obc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి