Florida: చేయని నేరానికి 37ఏళ్ల జైలు శిక్ష.. బాధితుడికి భారీ నష్టపరిహారం!

ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్‌ డుబోయిస్‌ చేయని నేరానికి 37ఏళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలయ్యాడు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో జైలుపాలై.. తన విలువైన జీవితాన్ని పొగొట్టుకున్నానని న్యాయం పోరాటం చేశాడు. దీంతో బాధితుడికి రూ.116 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

New Update
Florida: చేయని నేరానికి 37ఏళ్ల జైలు శిక్ష.. బాధితుడికి భారీ నష్టపరిహారం!

Crime: చేయని నేరానికి ఓ వ్యక్తి సుధీర్ఘకాలంపాటు జైలు శిక్ష అనుభవించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాను ఏ తప్పు చేయలేదని చెప్పినా వినని పోలీసు అధికారులు అన్యాయంగా నేరస్తుడి ముద్రవేసి అతన్ని జైలుకు పంపించారు. దీంతో విలువైన జీవితం జైలులో మగ్గిపోవాల్సి రాగా.. చివరికి న్యాయమే గెలిచింది. మర్డర్ కేసులో దొరికిన ఓ సాక్ష్యం అతణిని నిర్దోషిగా తేల్చింది. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

18 ఏళ్ల వయసులో లైంగికదాడి, హత్య..
ఈ మేరకు ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్‌ డుబోయిస్‌ను 18 ఏళ్ల వయసులో లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై 1982లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. 19 ఏళ్ల బార్బరా గ్రామ్‌ను అత్యాచారం చేసి, చంపేశాడంటూ అభియోగాలు నమోదు కావడంతో విచారణ అనంతరం అమెరికా కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ సహాయంతో అతని శిక్షను 2018లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. దీంతో రాబర్ట్ ఏకంగా 37 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు.

పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ జోక్యంతో..
అయితే బాధితుడి తరఫున చికాగోకు చెందిన పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ ఈ కేసులో జోక్యం చేసుకుని అతని ప్రమేయం లేదని నిరూపించడంతో రాబర్ల్ కు విముక్తి లభించింది. డీఎన్‌ఏ టెస్ట్‌ద్వారా నిర్దోషిగా తేలిన అతను 2020 ఆగష్టులో ఫ్లోరిడా జైలు నుండి విడుదలయ్యాడు. ఇక కొంతకాలం తర్వాత రాబర్ట్‌ డుబోయిస్‌ తనకు జరిగిన నష్టానికి న్యాయం కావాలంటూ పోరాటానికి దిగాడు. టంపా నగరం అధికారులు, విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు , ఫోరెన్సిక్ దంతవైద్యుడిపై ఫిర్యాదు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన అమెరికా కోర్టు అతని వాదనను సమర్ధించింది. బాధితుడికి 1.4 మిలియన్‌ డాలర్ల (రూ. 116 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. మూడు విడతల్లో బాధితుడికి పూర్తి నష్ట పరిహారం అందించాలని తీర్పు వెల్లడించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు