Roasted Chickpeas: గుప్పెడు శనగలు గుండెకు మేలు

వేయించిన శనగలు రోజూ తినడం వల్ల ​అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిలో ఉండే పోషకాలు చక్కని ఆరోగ్యాన్నిస్తాయి.

Roasted Chickpeas: గుప్పెడు శనగలు గుండెకు మేలు
New Update

Roasted Chickpeas; ఇప్పుడంతా జంక్ ఫుడ్ ట్రెండ్. అన్నీ ఆన్లైన్ లోనే ఆర్డర్ ఇవ్వటమే. స్నాక్స్ కూడా ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చే పరిస్థితి ఎదురయింది. ఎన్ని ఆన్లైన్ ఫుడ్స్ వచ్చినా సరే..వేయించిన శనగలు తింటే ఆ కిక్కే వెరప్పా.

దేశవాళీ శనగల్లో చాలా పోషకాలు

టైమ్ పాస్ కు తినే శనగల్తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.అందులోనూ వేపిన శనగలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉంటాయి.శనగలతో మన బాల్యానికి అవినాభావ సంబంధం ఉంది. స్కూల్ డేస్ లో జేబులో శనగలు వేసుకుంటూ టైమ్ పాస్ గా తింటూ ఆ రోజులు గుర్తుకు తెచ్చుకుంటే ఆ మజానే వేరు. మనకి తెలియకుండానే ఆకలి తీర్చుకుంది .. కాలక్షేపాన్ని ఇస్తుంది.అయితే..శనగల్లో రకాలున్నాయి. హైబ్రిడ్ శనగ, దేశవాళీ శనగలు అనే రెండు రకాలున్నాయి.ముఖ్యంగా దేశవాళీ శనగల్లో చాలా పోషకాలున్నాయి

ఎ, సి, బి6 విటమిన్స్ పుష్కలంగా లభించడమే కాకుండా ఫోలేట్‌, నియాసిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌... వంటి విటమిన్లు, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, కాపర్‌ లాంటి మినరల్స్‌ సైతం పుష్కలంగా లభిస్తాయి

టైమ్ పాస్ కోసం రోజూ కొద్దిగానైనా శనగలు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.

మితహారం  హితం

ముఖ్యంగా వేపిన శనగల్లో ఫైబర్‌, ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తాయి.వంద గ్రాముల శనగల్లో సుమారు 18 గ్రాముల ఫైబర్‌, 20 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుందంటే ఆశ్చర్యంగానే ఉంది కదా. ఈ ప్రోటీన్స్ ఆకలి లేకుండా చేస్తాయి. తద్వారా మితాహారం తినడానికి అలవాటు పడతారు.ఈ పోషకాలు కడుపును నిండుగా ఉంచుతుంది.ఎనర్జీ లెవెల్స్ పెంచడంలోనూ, హుషారుగా ఉండేందుకు కూడా ఇవి ఉపయోగ పడతాయి.

ALSO READ:PM MODI -NACIN :నాసిన్ అకాడమీని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ

బరువు తగ్గండిలా

ఇక.. వేయించిన శనగల్లో ఉన్న ఫైబర్ వల్ల వెయిట్ లాస్ జరుగుతుంది. తద్వారా ఊబకాయం రాకుండా చేస్తుంది.కేలరీలు తక్కువగా ఉండటం తో ఫ్యాట్ రాకుండా చేస్తాయి ఈ వేపిన శనగలు.

వేయించిన శనగల్లో ఉన్న కాల్షియం ఎముకలు,దంతాల పటిష్టతకు దోహదపడుతుంది.

రోజూ వేయించిన శనగలు తీసుకుంటే.. శరీరానికి సరయిన స్తాయిలో కాల్షియం లభించడం వల్ల ఆస్టియోపోరోసిస్‌ బారిన పడకుండా చూస్తుంది.

గుప్పెడు వేయించిన శనగలు తింటే గుండె పదిలం.

రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే గుండె సంభoదిత సమస్యలు రాకుండా చేస్తుంది.వీటిలో ఉండే రాగి, ఫాస్పరస్ వల్ల గుండె ఆరోగ్యం గా ఉంటుంది.

షుగర్ లెవెల్స్ అదుపులో

మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇవి ఉపయోగకారిగా ఉంటాయి.వీటిలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి సుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడమే కాకుండా షుగర్ లెవెల్ బ్యాలెన్సింగ్ గా ఉంచుతుంది.

ALSO READ:ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు-ధ్వజమెత్తిన కేటీఆర్

#roasted-chickpeas #health #heart-problems #healty-foods
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe