జడ్చర్లలో రోడ్డు ప్రమాదం జడ్చర్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణానికి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరి పొట్టు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. By Vijaya Nimma 04 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి 44వ జాతీయ రహదారిపై పొట్టు లారీ కింద పడడంతో పాటు మరో మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతోపాటు 4 గంటలకుపైగా ట్రాఫిక్ జామై ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నా ఘటన జడ్చర్ల హైవే రహదారిపై చోటుచేసుకుంది. మాచారం వద్ద హైదరాబాద్ రూట్‌లో ఉదయం 5:30 ప్రాంతంలో డివైడర్ ఢీకొని పొట్టు లారీ బోల్తాపడండి.దీంతో వాహనదారులు పోలీసులు రాకముందే కర్నూల్ రూట్‌లో వన్ వేపై వాహనదారులు వెళ్లడంతో గొల్లపల్లి వద్ద కర్నూల్ వైపు నుండి వెళ్తున్న పాల ట్యాంకర్ జడ్చర్ల వైపు వెళ్తున్న భారత్ బెంజ్ లారీ ఒకదానికొకటి ఎదురుగా ఢీకొనడంతో వీరి వెనకాల హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వస్తున్న కారు భారత్ బెంజ్ లారీని వెనుక నుండి ఢీకొంది. దీంతో కారులో ఉన్న వారితో పాటు లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఐదుగురిని 108లో ఆస్పత్రికి తరలించారు. ఇందులో భారత్ బెంజ్ లారీ డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అయితే వాహనాలు రోడ్డుకు అడ్డంగా పడడంతో అటు హైదరాబాద్ రూట్ కర్నూల్ రూట్ రూట్లో సుమారు 10 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సుమారు 4 గంటల నుండి ప్రయాణికులు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. జాతీయ రహదారిపై తాగడానికి మంచినీళ్లు లేక చిన్నారులకు పాలు, నీళ్లు లేక నరకయాతన అనుభవించారు. సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి రోడ్డుపై అడ్డంగా పడ్డ వాహనాలను పోలీసులు 4 గంటలకు తర్వాత హైవేపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. పొట్టు లారీ కింద పడ్డ సమయంలో పోలీసు రాకముందుకే వాహనదారులు సొంత నిర్ణయంతోటి వన్‌వేపైకి వెళ్లడంతోనే ఇంత భారీ ప్రమాదం జరగడానికి ట్రాఫిక్ అంతరాయం అయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు జడ్చర్ల పోలీసులు తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి