Road Accident : జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం!

జోగులాంబ గద్వాల జిల్లా లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు

New Update
Road Accident : జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవదహనం!

Road Accident : జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal) లో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం కాగా , నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌(Hyderabad) నుంచి చిత్తూరు(Chittoor) కు వెళ్తున్న జగన్‌ ట్రావెల్స్‌(Jagan Travels) బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

అదుపు తప్పి బోల్తా..

కర్నూలు(Kurnool) జిల్లా ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోనికి రాగానే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడడంతోనే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్థరాత్రి కావడంతో బస్సులోని ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు.

ఓ మహిళ మాత్రం బస్సులోనే..

వెంటనే బస్సు నుంచి కిటీకిల ద్వారా బయటకు వచ్చారు. కానీ ఓ మహిళ మాత్రం బస్సులోనే చిక్కుకుపోయింది. బయటకు రాలేకపోవడంతో మంటల ధాటికి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పి వేశారు.

ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికులంతా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూర్లకు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు అదుపు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also read: అయోధ్య రామ మందిర వేడుకలకు ఆ దేశంలో అధికారులకు 2 గంటల ప్రత్యేక విరామం!

Advertisment
తాజా కథనాలు