New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-55-2-jpg.webp)
Road accident: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరియాణాలోని అంబాలా ప్రాంతంలో మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. యూపీ నుంచి జమ్ములోని వైష్ణోదేవి తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు.
తాజా కథనాలు