Crime : ఓ మహిళతో అసాంఘిక క్రీడ(Illegal Activity) లో పాల్గొన్న దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియా(Social Media) లో పోస్ట్ చేసిన ఆర్ ఎంపీ డాక్టర్(RMP Doctor) అరెస్ట్ అయ్యాడు. మార్చి 11న సదరు మహిళా తాండూరు పోలీస్ స్టేషన్(Tandur Police Station) లో ఫిర్యాదు చేసింది.
ఉద్దండపూర్ లో అదుపులోకి..
ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయగా.. డాక్టర్ అహమద్ అలియాస్ అంజును 29న మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లా ఉద్దండపూర్ గ్రామంలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు తాండూరు పోలీసులు తెలిపారు. ఇక అహబద్ నిర్వహిస్తున్న క్లినిక్ సంబంధించి ఎలాంటి ఆర్ఎంపి సర్టిఫికెట్లు, ప్రథమ చికిత్స సర్టిఫికెట్లు లభించలేదని పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుందని, విచారణ చేపట్టి అన్నీ బయటపెడతామని పోలీసులు వెల్లడించారు.
Also Read : మగబిడ్డను కనలేదని.. భార్య, ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపిన వ్యక్తి!