Riyan Parag Comments On T20 World Cup : అమెరికా వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ లీగ్ లో టీమిండియా తమ ఫస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ తో జూన్ 5 న ఆడనుంది. ఇండియా ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి జోష్ మీదుంది.
ఇక టీ 20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ అవ్వని రియాన్ పరాగ్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన రియాన్ పరాగ్ ను వరల్డ్ కప్ కోసం తీసుకుంటారనే చర్చ జరిగింది.. కానీ, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతన్ని ఎంపిక చేయలేదు. ఇలాంటి తరుణంలో పరాగ్ టీ 20 వరల్డ్ కప్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Also Read : పపువా న్యూగినియా మీద చెమటోడ్చి నెగ్గిన విండీస్
వరల్డ్ కప్ చూడాలని లేదు...
తాజా ఇంటర్వ్యూలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ .." నేను వరల్డ్ కప్ జట్టులో ఉండుంటే.. ఏమమవుతుందనే టెన్షన్ ఉండేది. కానీ, ఇప్పుడీ టీమ్‌లో లేను. కాబట్టి నాకు పెద్దగా ఆసక్తి లేదు. చాలా మంది టాప్-4లో ఎవరు ఉంటారనే దానిపై చర్చిస్తున్నారు. ఇప్పుడే సమాధానం చెబితే కొన్ని జట్లపై పక్షపాతం చూపించినట్లు అవుతుంది.
నిజాయితీగా చెప్పాలంటే.. అసలు ఈసారి వరల్డ్ కప్‌ను చూడాలని కూడా నాకు లేదు. చివరికి ఎవరు గెలుస్తారనేది మాత్రమే చూస్తా. దాంతోనే సంతోష పడతా. నేను ఒకవేళ జట్టులో ఉంటే.. అప్పుడేమైనా టాప్ -4 టీమ్‌లు గురించి ఆలోచించేవాడినేమో. మైదానంలో విరాట్ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరు" అంతో చెప్పుకొచ్చాడు.