RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ!

రుణమాఫీ కాని రైతుల కోసం రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపింది. ఈ రోజు నుంచే మండల వ్యవసాయ అధికారి ఆఫీసు, రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

RUNAMAFI: రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్.. ఇవాళ్టి నుంచి ఫిర్యాదుల స్వీకరణ!
New Update

Telangana: తెలంగాణలో రుణమాఫీ కాని రైతుల కోసం రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి మూడు దశల్లో రెండు లక్షల లోపు రుణమాఫి చేసినప్పటికీ సాకేంతిక లోపం, పలు కారణాలతో చాలామందికి రుణమాఫీ కాలేదు. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతోపాటు రెండు లక్షలు దాటిన రైతులు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెండింగ్ రుణమాఫీలపై చర్యలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను నియమించనున్నట్లు తెలిపింది. ఇవాళ్టి నుంచే మండల వ్యవసాయ అధికారి ఆఫీసుతో పాటు రైతు వేదికల్లో ఫిర్యాదులు స్వీకరిచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా ఫిర్యాదు..
ఈ మేరకు ఆధార్‌ కార్డులోని సమాచారంలో తప్పులు, బ్యాంకు వద్ద నమోదైన డేటాలోని పొరపాట్లు, పట్టాదారు పుస్తకాల్లో సమస్యలు, పేరు సరిగా లేకపోయినా, ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా రైతులు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఇక రూ.2 లక్షలు దాటిన వారికోసం త్వరలో ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్న ప్రభుత్వం.. వారంలోగా దీనిపై వ్యవసాయశాఖ స్పష్టత ఇవ్వనున్నట్లు పేర్కొంది. మరోవైపు రుణమాఫి రెండు లక్షలు దాటిన రైతులు మిగతా సొమ్ము జమచేసిన తర్వాతే రెండు లక్షలు మాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసింది.

#special-nodal-system #telangana-rythu-runa-mafi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి