మునిగిపోయిన సంగమేశ్వర ఆలయం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరాలయం చుట్టూ నీటిమట్టం పెరుగుతోంది. గర్భాలయంలోకి నీరు చేరింది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం తగ్గుతోంది. By Vijaya Nimma 30 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి సంగమేశ్వరుడిని చుట్టేస్తున్న కృష్ణమ్మ శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరగడంతో కొత్తపల్లి మండలంలోని సప్తనదీ సంగమేశ్వరాలయాన్ని కృష్ణాజలాలు చుట్టేస్తున్నాయి. ఆలయం జలాధివాసానికి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ దంపతులు ఆదివాదం ఆలయంలోని వేపదారు శివలింగానికి కుంకుమార్చన, పుష్పార్చన, నదిజలాలతో అభిషేకం, మంగళహారతి వంటి విశేషపూజలు చేశారు. గంటగంటకు నీరు పెరుగుతుండటంతో గర్భాలయంలోకి నీరు చేరింది. మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువ గోదావరి వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టలేదు. తెలంగాణలోని గోదావరి నదిపై ఉన్నశ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను మూసేశారు. గోదావరి వరద ప్రవాహం ఎల్లంపల్లి, కాళేశ్వరం వద్ద తగ్గింది. లక్షల క్యూసెక్కులు పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా, తుంగభద్రలలో వరద తగ్గుముఖం పట్టింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వరద ప్రవాహం తగ్గింది. ఇక తుంగభద్ర డ్యామ్‌లోకి 84,202 క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ 69.23 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలంలోకి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,48,875, సుంకేశుల నుంచి 2,181 వెరసి 1,51,056 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో నీటి నిల్వ 837.9 అడుగుల్లో 58.81 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. శ్రీశైలం ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 157 టీఎంసీలు అవసరం. తెలంగాణలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో మూసీలో వరద ప్రవాహం తగ్గింది. అధికారులు అంచనా ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో.. ఆదివారం రాత్రి నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్‌ల వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద నీరు ఎక్కువ వస్తుండటంతో అక్కడ నీటి మట్టం 55.6 అడుగులకు చేరుకుంది. దాంతో మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టుగా పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు నీరు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి భారీ వరద చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 7వేల క్యూసెక్కులను వదులుతూ మిగులు జలాలను 175 గేట్ల ద్వారా అధికారులు కడలిలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లో నీటి మట్టం 15 అడుగుల వద్ద స్థిరంగా ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ 30.78 టీఎంసీలకు చేరుకుంది. మరో 15 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. మున్నేరు, కట్టలేరు, బుడమేరులలో వరద తగ్గుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి