Britain : జులై 4నే యూకే ఎన్నికలు.. తొలిసారి ఓటర్లను ఎదుర్కొనున్న రిషి!

ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు రిషి ప్రకటించారు. కేబినేట్‌ భేటీ తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

UK Election 2024: రిషి సునక్‌ ఓటమి... చరిత్రాత్మక తీర్పునిచ్చిన ప్రజలు!
New Update

British PM Rishi Sunak : ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు (General Elections) బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) పిలుపునిచ్చారు. జులై 4న సాధారాణ ఎన్నికలు జరగున్నట్లు రిషి ప్రకటించారు. కేబినేట్‌ భేటీ (Cabinet Meet) తర్వాత ప్రధాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఎన్నికల ప్రకటన గురించి తెలిపిన తరువాత... శుక్రవారం బ్రిటన్ పార్లమెంట్‌ ను రద్దు చేయనున్నట్లు రిషి సునాక్ కార్యాలయం పేర్కొంది.

యూకే (UK) లో రాజ్యాంగబద్ధంగా జనవరి 2025లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చాలా రోజులుగా ఊహాగానాలు వస్తునే ఉన్నాయి. వాటికి రిషి తెరదించారు. పార్లమెంట్‌ ను రద్దు చేయమని రిషి అభ్యర్థనను బ్రిటన్‌ రాజు ఆమోదం తెలిపారు.

ఇదిలా ఉంటే... 44 ఏళ్ల రిషి సునక్ ప్రధానమంత్రిగా ఓటర్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి.

అంతర్గత ఓట్ల ద్వారా 2022 అక్టోబర్‌లో కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి నియామకం అయ్యారు. 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం తర్వాత ఇది జరగబోయే మూడో సాధారణ ఎన్నికలు ఇవి. మరోవైపు, 14 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ చేతిలో కన్జర్వేటివ్‌లు ఓడిపోతారని ప్రీ-పోల్ సర్వేలు తెలుపుతున్నాయి. బ్రిటన్‌ పార్లమెంట్‌ రద్దు కంటే ముందే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని లేబర్ పార్టీ పేర్కొంది.

Also read: ఎట్టకేలకు దిగి వచ్చిన కోర్టు..నిందితుల బెయిల్ రద్దు!

#general-elections-2024 #britain #rishi-sunak
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe