Election Commission: ఏపీలో అల్లర్లు.. మరో పోలీస్ అధికారిపై వేటు ఏపీలో అల్లర్లలో అధికారుల వేటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజగా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్‌పై ఎన్నికల సంఘం వేటు వేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా సిట్ నివేదికతో మరికొంత మంది అధికారులపై వేటు పడితే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 30 May 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Election Commission: ఏపీలో ఎన్నికల్లో చెలరేగిన అల్లర్ల ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయిన విషయం తెలిసిందే. కాగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఈసీ వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో అధికారిపై వేటు చేసింది. చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ పై వేటువేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తన స్నేహితుడైప హోమియోపతి డాక్టర్ ను బుధవారం స్ట్రాంగ్ రూమ్ లోకి డీఎస్పీ తీసుకెళ్లాడు. కాగా సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆ దృశ్యాలను చూసి ఈసీ సీరియస్ అయింది. జిల్లా అధికారులు డీజీపీకి నివేదిక పంపడంతో డీఎస్పీపై వేటు వేసింది. ఈనెల 13వ తేదీ పోలింగ్ సందర్భంగా కూచువారిపల్లె, రామిరెడ్డి పల్లిలో అల్లర్లు అదుపు చేయడంలోనూ విఫలం అయ్యారని.. సిట్ నివేదికతో మరికొంత మంది అధికారులపై వేటు పడితే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి