SA vs IND: రింకూ రిథమ్.. సూర్య మెరుపులు.. తడబడినా నిలబడిన భారత్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ 20లో ఓపెనర్లిద్దరూ హాండిచ్చినప్పటికీ, యంగ్ సెన్సేషన్ రింకూ, కెప్టెన్ సూర్య హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. ఆ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది.

New Update
SA vs IND: రింకూ రిథమ్.. సూర్య మెరుపులు.. తడబడినా నిలబడిన భారత్

SA vs IND: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ 20 (T20I)లో భారత్ భారీ స్కోరే చేసింది. ఓపెనర్లిద్దరూ హాండిచ్చినప్పటికీ యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. ఆ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కోయెట్జీ 3, జాన్సెన్, విలియమ్స్, శంషీ, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. రింకూ టీ 20ల్లో తొలి హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మొదట్లోనే ప్రోటిస్ బౌలర్లు మాక్రో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ షాకిచ్చారు. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లు కనిపించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ ప్లేయర్స్ ఆక్షన్ అప్పుడే.. డిటైల్స్ ఇవే..

తిలక్, సూర్య ఇద్దరూ నిలకడగా ఆడుతూ క్రీజులో ఉన్నంతసేపూ దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో 29 పరుగులు (20 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్) చేసిన తిలక్ వర్మ కోయెట్జీ బౌలింగ్ లో జాన్సెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వేగంగా పరుగులు రాబడుతున్న సూర్య హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఊపు మీదున్న సూర్యకుమార్ ను (56; 36 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) శంషీ ఔట్ చేశాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 14 ఓవర్లలో నాలుగు వికెట్లకు 125 పరుగులు. అప్పుడు మొదలైంది రింకూ మరో బ్లాస్టింగ్ ఇన్నింగ్స్. మంచి రిథమ్ తో బ్యాటింగ్ చేసిన రింకూ ఈ మ్యాచ్ లో టీ 20లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రింకూ సింగ్ (68; 39 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో భారత్ 180 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Advertisment
తాజా కథనాలు