RGV's Vyuham: మరోసారి వ్యూహం సినిమా వాయిదా

డైరెక్టర్ RGV తెరకెక్కించిన వ్యూహం, శపథం సినిమాలు మరోసారి వాయిదా పడ్డాయి. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమాలను వాయిదా వేసినట్లు ఆర్జీవీ తెలిపారు. మార్చి 1న వ్యూహం, మార్చి 8న శపథం సినిమాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
RGV's Vyuham: మరోసారి వ్యూహం సినిమా వాయిదా

RGV Vyuham Movie Postponed : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల(Andhra Pradesh Politics) పై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV) తెరకెక్కించిన వ్యూహం, శపథం సినిమాలు మరోసారి వాయిదా పడింది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమాలను వాయిదా వేసినట్లు ఆర్జీవీ తెలిపారు. మార్చి 1న వ్యూహం, మార్చి 8న శపథం సినిమాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి వ్యూహం సినిమా రేపు (FEB 23న) విడుదల కావాల్సి ఉంది. ప్రొమోషన్స్ చేసుకోడానికి, అలాగే తమకు కావాల్సిన థియేటర్లు దక్కేందుకు సినిమా వాయిదా వేసినట్లు ఆర్జీవీ X లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..  గతంలో టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ ఈ సినిమా విడుదల ఆపేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. తాజాగా ఈ సారి సినిమా వాయిదా పడడానికి లోకేష్ కారణం కాదని సెటైరికల్ ట్వీట్ చేశారు వర్మ.

ALSO READ: ఆరోజు నుంచే ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్

వ్యూహం విడుదలకు లోకేష్ బ్రేక్!

రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) తీసిన ‘వ్యూహం'(Vyooham) సినిమా ఏపీ రాజకీయాల్లో(AP Politics) సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్(Sensor Certificate) ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సినిమాలో చాలా వరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా.. రాజకీయ ఎజెండాతో వ్యూహం సినిమాను రూపొందించారని, దీనిని అడ్డుకోవాలని లోకేష్ కోరారు. ఈ రిట్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్ట్ లో విచారణ జరిగింది.

Y.S రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) మరణం తర్వాత జగన్(YS Jagan) పొలిటికల్ ఎంట్రీ బ్యాక్ డ్రాప్ నేపథ్యంగా RGV ఈ సినిమాను తెరెకెక్కించారు. RGV ‘వ్యూహం’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు విడుదలకు సంబందించిన తేదీలను కూడా గతంలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు ఆర్జీవీ. అయితే, లోకేష్ పిటిషన్ వేయడంతో డైరెక్టర్ కు ఎదురుదెబ్బ తగిలింది. సినిమా విడుదలకు బ్రేక్ పడింది.

2009 నుంచి 2014 వరకు జగన్ కుటుంబంలో, ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఉద్దేశించినట్లు ఈ సినిమా ఉందని ట్రైలర్ లో స్పష్టమవుతుంది. ఎన్నికలకు ముందు RGV ఈ సినిమా తేదీని విడుదల చేయడంతో రాజకీయ నాయకులలో, ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. జగన్ కు అనుకూలంగా తీస్తున్న ఈ సినిమా జగన్ రాజకీయ భవిష్యత్, ఏపీ రాజకీయాలలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందని చాలా ఆసక్తిగా పెంచుతుంది.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు