RGV vs Srinivas Row: ఆర్జీవీ తల నరుకుతానన్న కొలికిపుడి కోసం ఏపీ సీఐడీ వేట.. నేరుగా ఇంటికి వెళ్లి..!

ఆర్జీవీ తల నరికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ డైరెక్టర్ ఆర్జీవీపై అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయమై శ్రీనివాస్ రావును అరెస్ట్ చేసేందుకు సీఐడీ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకోగా ఆయన ఇంట్లో లేరు.

New Update
RGV vs Srinivas Row: ఆర్జీవీ తల నరుకుతానన్న కొలికిపుడి కోసం ఏపీ సీఐడీ వేట.. నేరుగా ఇంటికి వెళ్లి..!

ఓ టీవీ ఛానెల్‌లో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)పై అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ (Kolikapudi Srinivasa Rao) షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. RGV తల నరికి తెచ్చిన వారికి కోటీ రూపాయలు ఇస్తానంటూ సవాల్ చేశారు. దీనిపై ఘాటుగానే స్పందించిన ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా ఏపీ డీజీపీకి కంప్లైంట్ చేశారు. ఇక ఆర్జీవీ కేసు పెట్టిన తర్వాత ఏపీ సీఐడీగా దూకుడిగా వ్యవహారిస్తోంది.

కొలికపూడి శ్రీనివాస్ రావు(Kolikipoodi Srinivas Rao)ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న సీఐడీ(CID) ప్రత్యేక బృందం.. నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీకి చేరుకుంది. మొత్తం 8మందితో కూడిన సీఐడీ బృందం ఆయన ఇంటికి చేరుకుంది. అయితే కొలికపూడి హైదరాబాద్‌(Hyderabad)లో అందుబాటులో లేరు. ఇక ఆఫీసుకు వెళ్లిన అయన సతిమణిని ఇంటికి రావాలని సీఐడీ చెప్పింది. సీఐడీ ఆయన ఇంటికి వచ్చిన సమయంలో కొలికపూడి ఇంట్లో పాప, కేర్ టేకర్‌ మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఇక ఈ కేసులో కొలికిపూడికి నోటిసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

publive-image

అసలేం జరిగింది:
టీవీ5(తెలుగు మీడియా ఛానెల్‌)లోని ఓ చర్చా కార్యక్రమం నిర్వహించగా ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొలికపూడి శ్రీనివాస్. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ రామ్ గోపాల్ వర్మను చర్చలోకి లాగిన శ్రీనివాస్.. 'రామ్ గోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటీ రూపాయలు ఇస్తా' అంటూ సవాల్ చేశారు. వెంటనే షోలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చట్ట ప్రకారమే మాట్లాడలని కోరారు. అలాగే శ్రీనివాస్ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని రిక్వెస్ చేసినా వినకుండా మొండిగా వాధించిన శ్రీనివాస్ 'ఐ రిపీట్.. ఐ రిపీట్.. నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు' అంటూ రెచ్చిపోయారు.

కొలికిపుడి శ్రీనివాస్ డిబేబ్‌లో నన్ను చంపడానికి సూపారి ఇస్తానంటూ అతను కామెంట్స్‌ చేసినా .. ఆ డిబేట్‌ని యాజమాన్యం కొనసాగించడం తప్పు అని ఆర్జీవీ ఫైర్ అయ్యారు. అతను మాటలు తప్పు అని కూడా ఎవరు ఖండించలేదని RGV మండిపడ్డారు. ఎప్పుడూ నన్ను చంపడానికి ఎవరు సూపారి ఇవ్వలేదని అందుకే ఇప్పటివరకు తాను కంప్లైంట్ చెయ్యలేదని చెప్పారు ఆర్జీవీ. అయితే కొలికిపుడి శ్రీనివాస్ రావు, యాంకర్ సాంబశివ రావు, టీవీ-5 ఛానెల్ ఎండీ బీఆర్ నాయుడు (B.R.Naidu) మీద కంప్లైంట్ ఇచ్చానని తెలిపారు. ప్రోసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారన్నారు. ఇక కంప్లైంట్ చేసిన కొన్ని గంటలకే పోలీసులు రంగంలోకి దిగారు.

Also Read: విజయకాంత్‌ని అలా చూసి బోరుమన్న రజనీకాంత్.. వీడియో వైరల్‌!

Advertisment
తాజా కథనాలు