/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-28T180208.864-jpg.webp)
RGV Tweet: 2024 రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించగా..ఈ ఏడాది మొత్తం ఐదుగురు ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. అందులో మన తెలుగు తేజాలయిన సినీ ఇండస్ట్రీ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును పద్మ విభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రముఖులు వరకు అందరు శుభాకాంక్షలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా పద్మ విభూషణ్ గ్రహీత చిరంజీవిని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. RGV చేసే ట్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదానికి ట్వీట్స్ చేస్తారా.. లేదా ఆయన ట్వీట్స్ వివాదానికి కారమవుతాయ తెలియదు. ఇక ఇప్పుడు పద్మ విభూషణ్ గ్రహీత చిరంజీవికి సెటైరికల్ గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆర్జీవీ ఈ విధంగా పోస్ట్ పెట్టారు.
Also Read: Chaitanya post: విడాకుల పై నిహారిక కామెంట్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త
ఆర్జీవీ ట్వీట్
తాను "శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం, శ్రీ బిందేశ్వర్ పాఠక్ పేర్లను ఎప్పుడూ వినలేదు. వారిని కూడా మెగాస్టార్ కు సమానమైన స్థితిలో ఉంచడానికి. అందుకే ఈ అవార్డు పై థ్రిల్‌గా లేను. ఒకవేళ చిరంజీవి సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా నటిస్తానని రాసుకొచ్చారు. " దీని పై నెటిజన్లు ఫైర్ అవుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. నీ బాదేంటి.. ముందు ఇతరులను ప్రశంసించడం నేర్చుకో.. మరి నీకు ఎందుకు అవార్డు ఇవ్వడం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
I never heard of Shri Padma Subrahmanyam or Shri Bindeshwar Pathak and so to put them in the same position as MEGA STAR , I am not at all thrilled with the award , but if @chirutweets gaaru is happy I will also pretend to be happy 😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2024
Also Read: SSMB 29: రాజమళి సినిమా కోసం మహేశ్ షాకింగ్ నిర్ణయం.. రెమ్యునరేషన్ రూపాయ్ కూడా వద్దు..!