SSMB 29: రాజమళి సినిమా కోసం మహేశ్ షాకింగ్ నిర్ణయం.. రెమ్యునరేషన్ రూపాయ్ కూడా వద్దు..! మహేశ్‌బాబు-రాజమౌళి కాంబో మూవీపై అనేక వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ సినిమాకు మహేశ్ అసలు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. దానికి బదులుగా ప్రొడ్యూసింగ్ పార్టనర్‌గా ఉండనున్నారట. By Archana 28 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి SSMB 29: RRR తర్వాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఇది ఒకటి. అయితే జక్కన్న తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమా స్క్రిప్ట్ కూడా చేసినట్లు కొన్ని రోజుల క్రితమే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన లొకేషన్స్ వెతకడంలో బిజీ అయిపోయారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది. జీరో రెమ్యునరేషన్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో మహేష్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా జక్కన్న చిత్రాల్లో హీరోల రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు మాత్రం జీరో రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: Jai Hanuman: హనుమంతుడిగా రానా దగ్గుబాటి.. వైరలవుతున్న న్యూస్ కామన్ గా రాజమౌళి సినిమాలు అంటే 1-2 లేదా సంవత్సరాల టైం తీసుకుంటారు. దీంతో జక్కన్న మహేష్ డేట్స్ బ్లాక్ చేయడం పట్ల కాస్త ఆందోళన చెందారట. అయితే సూపర్ స్టార్ రాజమౌళికి తన మూడు సంవత్సరాల డేట్స్ ఇస్తానని హామీ ఇచ్చారట. కానీ తమ ఇద్దరి కెరీర్ లో బెస్ట్ అవుట్ ఫుట్ అందించాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ కోసం మహేష్ బాబుకు రెమ్యూనరేషన్ కాకుండా పార్టనర్ షిప్ ఇవ్వాలని జక్కన్న ఇంట్రెస్ట్ చూపుతున్నారని టాక్. అంతే కాదు ఈ సినిమాకు మహేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. No remuneration for #MaheshBabu in #Rajamouli film 👉#Rajamouli is concerned about blocking Mahesh's dates for 1-2 years; however, #Mahesh is claimed to have assured him of up to 3 years of dates, stating that he wants to deliver the best output ever in both their careers.… pic.twitter.com/PXXNqEH5tD — PaniPuri (@THEPANIPURI) January 27, 2024 రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి కెఎల్ నారాయణ నిర్మాత అయినప్పటికీ.. బడ్జెట్, ఫైనాన్స్ నిర్ణయాలన్నింటినీ రాజమౌళి నిర్వహిస్తున్నారని టాక్. అయితే ఇంతటి భారీ చిత్రాన్ని నిర్మించేటప్పుడు.. తన రెమ్యునరేషన్ భారాన్ని మోయకూడదని.. సినిమా పూర్తయ్యే వరకు ఒక్క పైసా కూడా చెల్లించవద్దని మహేష్ బాబు సూచించినట్లు నెట్టింట్లో ఓ న్యూస్ వైరలవుతుంది. Also Read: Chaitanya post: విడాకుల పై నిహారిక కామెంట్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త #ssmb-29 #mahesh-babu-zero-remuneration-in-ssmb-29 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి