ఏం సినిమారా నాయనా.. ఆదిపురుష్ డైరెక్టర్‌పై మండిపడుతున్న నెటిజన్స్...

పాన్‌ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ యాక్ట్ చేసిన మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాపై చిత్రయూనిట్ భారీ అంచనాలతో శుక్రవారం ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చింది. కానీ థియేటర్లలో కొందరు ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా, ఇంతా కాదు.. బాగుందని కొందరు నెటిజన్లు అంటే.. బాగలేదని మరికొందరు ఇలా ఎవరికి వారే తమ ఒపినియన్‌ని చెప్పుకొచ్చారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

New Update
ఏం సినిమారా నాయనా.. ఆదిపురుష్ డైరెక్టర్‌పై మండిపడుతున్న నెటిజన్స్...

Adipurush Movie Review

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన, ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆదిపురుష్‌.. ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు ఆదిపురుషుడిగా, ప్రభాస్‌ థియేటర్లలోకి అడుగుపెట్టాడు. మొదటి షో నుంచే, ఈ సినిమా భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచుకుని, బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్ చేసి థియేటర్లను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్‌. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో పాజిటివ్ గా రివ్యూ ఇస్తే, మరికొంతమంది నెగిటివ్‌గా రివ్యూలు ఇచ్చారు.

ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. అయితే ఈ సినిమా చూసినా ప్రేక్షకుల అభిప్రాయం ఏంటంటే, డైరెక్టర్ తీసిన విధానం బాగాలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. రాముడి పాత్రకి ప్రభాస్ సూట్ అవ్వలేదు. మరి ఆదిపురుష్ సినిమా అంతగా ఎందుకు ఇష్టపడుతున్నారంటే, అది కేవలం ప్రభాస్ కోసమేనని మూవీ చూసిన పబ్లిక్ తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. అందులోను ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే సినిమా చూడటానికి వెళ్తున్నారు. కానీ వేరే ఎవ్వరు సినిమాని అంతగా ఇష్టపడటంలేదని నెటిజన్ల అభిప్రాయం. ఇదిలా వుంటే.. సీత పాత్రని, రావణుడి పాత్రను, ఎవరు పెద్దగా ఇష్టపడటం లేదు. ప్రభాస్ ఒక్కడికోసం మాత్రమే సినిమా చూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆదిపురుష్ సినిమా, సెక్యులర్ రామాయణంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఆదిపురుష్ లో ప్రభాస్ చేసిన రాముడి పాత్ర కంటే, ఆర్ఆర్ఆర్‌లో, రామ్‌చరణ్ ప్లే చేసిన అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ తో, ప్రభాస్ రాముడి పాత్రను కంపేర్ చేసి మరి కామెంట్ చేస్తున్నారు. రామ్‌చరణ్ ఆ వేషంలో ఎంతగానో ఒదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేశాడని నెటిజన్లు అంటున్నారు. ఇదంతా చూసి కూడా ఎవరైతే, జై శ్రీరామ్ అని అంటున్నారో, వాళ్ళతో ఏకీభవించడం అంతా మంచిది కాదని నెటిజన్లు అభిప్రాయం. మరి ఇంతకీ ఈ సినిమాపై మీరెమనుకుంటున్నారో మీ ఒపినియన్‌ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు