Revanth Reddy: ఆయన నా గురువు కాదు.. సహచరుడు.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలకు రేవంత్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. చంద్రబాబు తనకు గురువు కాదని, తన సహచరుడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో షర్మిలను ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పారు. 

New Update
CM Revanth : జీవన్ రెడ్డి విషయంలో తప్పు మాదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Revanth Reddy:ఎన్నికల వేళ నేతల మాటల  తూటాలు పేలుతున్నాయి. ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో రేవంత్ కోసమే టీడీపీ పోటీచేయకుండా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు తనదైన శైలిలో తిప్పికొట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 

Revanth Reddy: ఒక ఇంటర్వ్యూలో మీ గురువు చంద్రబాబు కోసం శిష్యుడు ఏదైనా చేసేది ఉందా? అని వచ్చిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పారు. తనకు గురువు ఎవరూ లేరని.. చంద్రబాబు తనకు గురువు కాదని.. తానూ అయన సహచరుడినని పేర్కొన్నారు. అంతేకాదు ఎవడైనా బుద్ధిలేని వెధవ గురు..శిష్యులు అని చెత్త వాగితే వాడిని తన్నడం పక్కా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: బాబాయ్‌ కోసం అబ్బాయి…పిఠాపురానికి చరణ్‌!

Revanth Reddy:తాను మొదట ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ అయ్యానని రేవంత్ చెప్పారు. తరువాత టీడీపీలో చేరానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాబట్టి పార్టీ అధినేతగా తాను ఆయనకు అపారమైన గౌరవం ఇస్తానని అన్నారు. అంతేకానీ, తామిద్దరమూ గురుశిష్యులం కాదని స్పష్టం చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అని.. తమ పార్టీ ఆమెను ఏపీ ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే, తానూ అందుకోసమే తాను పనిచేస్తానని అన్నారు. దానికోసమే తానూ వైజాగ్ వెళ్లి ప్రచారం చేసి వచ్చానని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు