CM Revanth Reddy : మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి : రేవంత్ రెడ్డి

మేడిగడ్డ సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా పెట్టామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్ నేతలు పొగుడుతున్న కాళేశ్వరం గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని రేవంత్ అన్నారు.

New Update
CM Revanth Reddy : మేడిగడ్డ కూలిందా.. కూల్చేశారా తేల్చేద్దాం పదండి : రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మేడిగడ్డ(Medigadda) సందర్శనకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్(Ex.CM KCR) కు పిలుపునిచ్చారు. కేసీఆర్ కోసం హెలికాఫ్టర్ రెడీగా పెట్టామన్నారు. ప్రపంచంలోనే అద్భుతమంటూ బీఆర్ఎస్(BRS) నేతలు పొగుడుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) గొప్పతనాన్ని కేసీఆర్ స్వయంగా వివరిస్తే బాగుంటుందని సీఎం రేవంత్ అన్నారు. మేడిగడ్డ కూలిందా లేదంటే కూల్చేశారా? అనేది తేల్చేద్దామని అన్నారు. అసలు కాళేశ్వరం కథేంటో సభలో తెల్చుకుందామన్నారు.

అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం రూ.38,500 కోట్లతో 2008లో టెండర్లు పిలిచారని తెలిపారు. వెంకటస్వామి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) పేరు పెట్టారన్నారు. రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి రూ.1 లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారని వెల్లడించారు. ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారన్నారు. అయితే, ఇసుకలో పేక మేడలు కట్టారా? అని ప్రశ్నించారు. ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు..ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కు విజ్ఞప్తి

కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని..దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిందని వ్యాఖ్యానించారు. విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చిందని.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉందని అన్నారు. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉందని.. అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దామని చెప్పారు. మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి అని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

Also Read : మరో నెలలో పెళ్లి.. ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య!

వాస్తవాలు తెలియాలి..

'మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి.. మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి.. తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండి..జరిగిన వాస్తవాలు తెలంగాణ(Telangana) ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..? కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు.. కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా.. మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే.. హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది.. రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు'. అని మాట్లాడారు. కాగా, మధ్యాహ్నం 3గంటలకు మేడిగడ్డ  ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేల తోపాటు పలువురు ముఖ్యనేతలు సందర్శించనున్నారు. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు హై అలర్ట్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు