ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు
తాగా జితేందర్‌రెడ్డి ట్వీట్‌కి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ ట్వీట్ చేశారు. జితేందర్‌రెడ్డి బీజేపీ అంతర్గత తన్నులాటను అద్భుతమైన పోలికతో ప్రజలకు వివరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరని రేవంత్ ట్వీట్ చేశారు. ఎన్నికల దగ్గర పడటంతో పార్టీలో ఉన్న నేతలే.. ట్వీట్ చేయడంతో రాష్ట్రం ఎన్నికల హీట్ ఎక్కువైంది.
బీజేపీలో తీవ్ర దుమారం
తెలంగాణ బీజేపీ నేత జితేందర్‌రెడ్డి చేసిన ట్వీట్ ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. నేతల మధ్య విభేదాలు, నాయకత్వ మార్పు, కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పెట్టిన వీడియో చర్చనీయాంశమైంది. దున్నపోతును ఓ వ్యక్తి తన్నిన వీడియో పెట్టిన ఆయన.. ఇలానే తెలంగాణ బీజేపీ నేతలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలని క్యాప్షన్ ఇచ్చారు.
ట్వీట్‌పై క్లారిటీ
ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో జితేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారిని ఉద్దేశించే ఆ ట్వీట్ పెట్టానని ఆయన క్లారిటీ ఇచ్చారు. బిస్కెట్ల కోసం బరితెగించకండంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్‌పై విరుచుకుపడ్డారు.కేసీఆర్ సోషల్ మీడియా ఊర కుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే.. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊర కుక్కల్లార.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు.