Sultanabad Issue: కఠినంగా శిక్షించండి.. ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్! సూల్తానాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పసిపాపపై ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలంటూ డీజీపీ రవి గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు. By srinivas 14 Jun 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి CM Revanth Reddy Serious On Sultanabad Issue: ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగిన ఘటన గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లాలో జరిగింది. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని మమతా రైస్ మిల్‌లో తల్లితోపాటు నిద్రిస్తున్న ఆరేండ్ల బాలికను అదే మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తున్న బలరాం అనే దుండగుడు సమీపంలోని పొదల్లోకి ఎత్తుకెళ్లి హత్యాచారం చేశాడు. అయితే ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పసిపాపపై ఈ దారుణానికి పాల్పడిని నిందితుడిని కఠిన శిక్ష పడేలా చూడాలంటూ డీజీపీ రవి గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. రైస్ మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని అందులో డ్రైవర్‌గా పనిచేస్తున్న డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు.ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అర్ధరాత్రి లేచి చూసేసరికి బాలిక కనపడకపోవడంతో గమనించిన తల్లి తోటి కార్మికులకు ఈ విషయాన్ని తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే నారాయణ పేట జిల్లా ఉట్కూర్‌లో భూతగాదాలో వ్యక్తి దారుణ హత్యపై సీఎం ఆరా తీశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని డీజీపీని ఆదేశించారు. Also Read: బిర్యానీలో బల్లి.. ప్రశ్నించిన కస్టమర్ పై హోటల్ యజమాని దౌర్జన్యం! #cm-revanth-reddy #sultanabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి