Revanth Reddy:కావాలనే నాగార్జున సాగర్ వివాదం సృష్టించారు-రేవంత్ రెడ్డి

నాగార్జునా సాగర్ దగ్గర వివాదం ఎవరు ఎందుకు సృష్టించారో తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసునని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది..నీళ్ళు ఎక్కడికీ పోవు అంటూ విరుచుకుపడ్డారు.

New Update
Revanth Reddy:కావాలనే నాగార్జున సాగర్ వివాదం సృష్టించారు-రేవంత్ రెడ్డి

నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం కావాలనే వ్యూహాత్మకంగా చేశారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎవరు, ఎందుకు ఈ పని చేశారో అందరికీ తెలిసిందే అని విమర్శించారు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది, నీళ్ళు ఎప్పుడూ ఎక్కడికీ పోవు. మరి అలాంటిది పోలింగ్ రోజునే ఎందుకు గొడవ చేశారు అంటూ రేవంత్ విమర్శించారు. దీని మీద సీఈవో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.తొమ్మిదేళ్లుగా కేసీఆర్‌ ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.ఎన్నికలు వచ్చినప్పుుడు తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధికి కేసీఆర్‌ పన్నాగాలు పన్నుతున్నారని రేవంత్ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి.

Also read:పోలింగ్ రోజున కావాలనే తెలంగాణ సెంటిమెంట్ ను లేవదీస్తున్నారు-కోమటిరెడ్డి వెంకటరెడ్డి

డ్యామ్ వివాదం మీద కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరే స్పందిస్తున్నారు. మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు