రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. తనను సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో అగ్రనేతలను కలిసి ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. ఇంకా.. మంత్రివర్గ కూర్పుపై చర్చించారు. ఓ దశలో ఢిల్లీ ఎయిర్పోర్టు కు వచ్చి హైదరాబాద్ కు బయలుదేరున్న సమయంలో హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో తిరిగి వెళ్లారు రేవంత్.
ఇది కూడా చదవండి: Hyderabad Traffic Update: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
మంత్రి వర్గ కూర్పుపై హైకమాండ్ మార్పులు చేర్పులు చేయడంతో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అయితే కాబినెట్ కూర్పపై స్పష్టత వచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగివచ్చారు. రేపు రేవంత్‌తో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ప్రమాణం చేయనున్న వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క పేర్లు కేబినెట్ మంత్రుల లిస్ట్ లో తప్పకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.