రేవంత్‌రెడ్డికి మతిస్థిమితం లేదు: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలంగాణలో కరెంట్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలందరూ ధర్నాలు, ర్యాలీలు చేసి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ స్పందించారు. మీకు మతిస్థిమితం లేకనే అలా మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే. By Vijaya Nimma 14 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఉచిత కరెంట్‌పై.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డికి మతిస్థిమితం లేక ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు 3 గంటలు కరెంట్ సరిపోద్ది అనడం సిగ్గు చేటు అన్న ఆయన కాంగ్రెస్ హయంలో 2004-09 వరకు 7 గంటలు విడతల వారీగా ఇచ్చేవారని గుర్తు చేశారు. తరువాత మేనిఫెస్టోలో 9 గంటలు కరెంట్ ఇస్తామని రైతులు మోసం చేశారని అన్నారు. బీఅర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన కరెంట్‌ను రైతులకు అందిస్తుందని చెప్పారు. చంద్రబాబు రేవంత్‌రెడ్డికి ఎది చెబితే అదే చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కంట్రోల్‌లో రేవంత్‌రెడ్డి వున్నాడని.. రేవంత్‌రెడ్డి బాషా చాలా అధ్వాన్నంగా వుందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి క్షేమాపన చెప్పాలి సీఎం కేసీఆర్ సింగిల్‌గా 109 సీట్లు ఒకేసారి ప్రకటించారు. నీకు దమ్ముంటే.. నువ్వు మోగొడివైతే నువ్వు ఇవ్వగలవ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కనీసం సంక్షేమ ఫలాలు ఇవ్వలేకపొతున్న మీరు.. ఇక్కడ ఆసరా పెన్షన్ 4000 ఇస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పంపించిన కటప్పవు నువ్వు అని అన్నారు. బేశరుతుగా రేవంత్‌రెడ్డి క్షేమాపన చెప్పాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటమణారెడ్డి డిమాండ్ చేశారు. బొత్స సత్యనారాయణ మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోండని వార్నింగ్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదు.. దాని పని చూసుకోండి అన్నారు. మేము కళేశ్వరం ప్రాజెక్ట్ 3 సంవత్సరంలో పూర్తి చేశాంమని అన్నారు. బొత్స అసలు మీ రాష్ట్ర రాజధాని ఎక్కడని ప్రశ్నించారు. ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు ఇక గతం రెండు రోజులుగా తెలంగాణలో ఇస్తున్న ఉచిత కరెంట్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై గురువారం బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణలో ఇస్తున్న ఉచిత కరెంట్‌పై లేనిపోని వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిని రైతులు తరిమికొట్టాలి బీఆర్ఎస్ నాయకలు అన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. అదే విధంగా బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్‌తో అన్నదాతలు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారని తెలిపారు. అది చూసి ఓర్వలేకనే రేవంత్‌రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి