తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్.. నేడు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ!

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. ముఖ్యమత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి 6 హామీల అమలుతో పాటు దివ్యాంగురాలు

New Update
తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్.. నేడు సాయంత్రం 5 గంటలకు కేబినెట్ భేటీ!

తెలంగాణలో కొత్త సర్కారు కొలువుదీరింది. సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) పాటు మరో 11 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజినికి ఉద్యోగ నియామక ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సమిధలా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించామన్నారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ కు మోడీ, హరీష్ రావు, లోకేష్ శుభాకాంక్షలు

సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామన్నారు. అమరవీరుల, విద్యార్థి, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని భరోసానిచ్చారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని భరోసానిచ్చారు.

మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి రానున్నారు. రేవంత్ కు ఘన స్వాగతం పలికేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమయ్యారు. సచివాలయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ గా శివధర్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించింది రేవంత్ సర్కార్. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. నిర్వహించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు