తెలంగాణ సమాజం కోసం అహర్నిశలు పరితపించిన వ్యక్తి గద్దర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అలాంటి వ్యక్తి మరణించారని తెలిసినా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నివాళులు అర్పించలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరపడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తండ్రికొడుకులు చర్చను రేవంత్ రెడ్డి చుట్టూనే తిప్పారన్నారు. సభలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీలో తాను చంద్రబాబు శిష్యుడిని కాదని.. సహచరుడిని అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచాకే తాను టీడీపీలో చేరానని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ ప్రస్థానం టీడీపీలో చంద్రబాబు అనుచరుడిగా మొదలైందని గుర్తుచేశారు. నిలువ నీడ లేని కేసీఆర్‌కు టీడీపీనే ఆధారమైందన్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్.. నువ్వు వస్తావో, కేటీఆర్‌ను పంపుతావో.. నేను రెడీ: రేవంత్ రెడ్డి
తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహంపై అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కేసీఆర్.. మీరు వస్తారో,కేటీఆర్‌ను పంపుతారో, హరీష్‌ను పంపుతారో తేల్చుకోమని సవాల్ విసిరారు.
Translate this News: