Revanth Reddy: రేవంతే ముఖ్యమంత్రి!.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క?

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధిష్టానం రేవంత్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. భట్టి విక్రమార్కకు డిప్యటీ సీఎం పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు చెప్తున్నారు.

Revanth Reddy: రేవంతే ముఖ్యమంత్రి!.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క?
New Update

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధిష్టానం రేవంత్‌ వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ మ్యాజిక్‌ ఫిగర్ దాటిన వెంటనే సీఎంగా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో పాటు, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే, సంప్రదింపుల అనంతరం అధిష్టానం రేవంత్‌ రెడ్డికే ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసీనయంగా తెలుస్తోంది.

డిప్యూటీ సీఎంగా భట్టి?:
ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్కకు నచ్చజెప్పి అధిష్టానం డిప్యూటీ సీఎంగా నియమించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: 17 ఏళ్లలో జెడ్పీటీసీ టు సీఎం రేస్.. రేవంత్ రెడ్డి సంచలన రాజకీయ ప్రస్థానం

రేపే ప్రమాణ స్వీకారం?:
సీఎం, డిప్యూటీ సీఎంలుగా వారిద్దరూ సోమవారమే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై వారిద్దరితో ప్రమాణస్వీకారం చేయించబోతున్నట్లు సమాచారం. సాయంత్రం ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించాలని ఆ పార్టీ ఆలోచనలో ఉంది. అక్కడే సీఎల్పీ నేతగా రేవంత్‌ రెడ్డిని ఎన్నుకుంటారు. కాగా, 9వ తేదీని కేబినెట్‌ విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే సహా కీలకనేతలంతా హాజరవుతారు.

#revanth-reddy #mallu-bhatti-vikramarka
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe