Telangana: తుపాను ఎఫెక్ట్.. అధికారులకు రేవంత్ కీలక ఆదేశాలు..

తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు.

New Update
Telangana: తుపాను ఎఫెక్ట్.. అధికారులకు రేవంత్ కీలక ఆదేశాలు..

Telangana New CM: తెలంగాణ పీసీసీ చీఫ్, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్ర అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మిచాంగ్ తుపాను నేపత్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలై.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే.. బీఆర్ఎస్ ఓటమిని అంగీకరించిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ప్రగతి భవన్ నుంచి నేరుగా తన స్వగృహానికి వెళ్లిపోయారు. తన లేఖను గవర్నర్‌కు పంపించగా.. గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. ఆ వెంటనే రాష్ట్ర శాసనసభను రద్దు చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రానికి సీఎంగా ఎవరూ లేరు.

మరోవైపు కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి.. ఏకంగా అధికారులకు ఆదేశాలివ్వడం హాట్ డిస్కషన్‌గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు