Sonia Revanth: సోనియాతో రేవంత్ భేటీ.. అభ్యర్థుల ఎంపిక ఫైనల్!

సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 100 రోజుల పాలన, గ్యారంటీల అమలు, పార్టీ బలోపేతం, నేతల చేరికల పై సోనియాగాంధీకి వివరించారు. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాల పై అధిష్టానంతో చర్చలు జరిపారు.

Sonia Revanth: సోనియాతో రేవంత్ భేటీ.. అభ్యర్థుల ఎంపిక ఫైనల్!
New Update

తెలంగాణలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి రేవంత్‌రెడ్డి మినిట్‌ కూడా గ్యాప్‌ లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా టూర్లు, సభలతో బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా అనేకసార్లు ఢిల్లీ వెళ్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన కాంగ్రెస్‌ సార్వత్రిక ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌, బీజేపీని మట్టికరిపించాలని ప్లాన్ వేస్తోంది.ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికపై రేవంత్‌రెడ్డి ఫుల్‌గా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో సోనియాగాంధీని కలిశారు సీఎం.

సీఈసీ మీటింగ్‌లో రేవంత్‌:

పార్లమెంట్‌ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 100 రోజుల పాలన, గ్యారంటీల అమలు, పార్టీ బలోపేతం, నేతల చేరికల పై సోనియాగాంధీకి వివరించారు రేవంత్‌. లోక్ సభ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారాల పై అధిష్టానం తో చర్చలు జరుపుతున్నారు. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ,సీఈసీ సమావేశాల్లో రేవంత్‌ పాల్గొననున్నారు. తెలంగాణలో 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది కాంగ్రెస్. మొదటి లిస్ట్ లో మహబూబ్ నగర్,మహబూబాబాద్, జహీరాబాద్ ,నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్.

ఇక ఇటివలి కాలంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే చేవెళ్ల ఎంపీ జి.రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్లను పార్టీలో చేర్చుకోవడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌ కాంగ్రెస్ గట్టి షాక్‌ ఇచ్చింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నాలుగు లోక్ సభ స్థానాలు ఉండగా, చేవెళ్లలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా రాష్ట్ర రాజధాని పరిధిని దాటి విస్తరించి ఉన్నాయి. 2019లో మల్కాజ్‌గిరి లోక్సభ స్థానం నుంచి రేవంత్, హైదరాబాద్ నుంచి ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్ఎస్ తరఫున రంజిత్‌రెడ్డి చేవెళ్ల, సికింద్రాబాద్ నుంచి జి.కిషన్‌రెడ్డి గెలుపొందారు.

Also Read: జాగ్రత్త.. ఎమ్మెల్యే అభ్యర్థులకు జగన్ వార్నింగ్!

#revanth-reddy #sonia-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe