Runa Mafi: రుణమాఫీ అమలుపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేసే పనిలో పడ్డారు అధికారులు. బ్యాంకులతో కలిసి రైతుల జాబితా సిద్ధం చేసే యోచన చేస్తున్నారు. గ్రామసభలో చర్చించాకే రైతుల ఫైనల్ లిస్ట్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రుణమాఫీ మార్గదర్శకాల విడుదల చేయనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అసలు, వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల రుణమాఫీ చేసేలా ప్రణాళిక తాయారు చేస్తున్నారు.
రెండుమూడు బ్యాంకు అకౌంట్లు ఉన్నా 2 లక్షల మాఫీ, అలాగే బంగారంపై ఉన్న పంట రుణాలూ మాఫీ కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. కాగా కుటుంబంలో ఒక్కరికే ఈ రుణమాఫీ వర్తించనుంది. పీఎం కిసాన్ నిబంధనలను రుణమాఫీకి అమలు చేస్తారా, లేదా అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తి చేయడమే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. రుణమాఫీకి దాదాపు రూ. 31వేల కోట్ల ఖర్చు అవుతున్నట్లు అధికారులు అంచనా చేశారు.