న్యూజిలాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. షాహీన్ షా ఆఫ్రిదిని కెప్టెన్ గా తొలగించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆ బాధ్యతలను బాబర్ అజామ్ కు అప్పగించింది. అయితే ఈ 17 మంది సభ్యుల జట్టులో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే, కొద్ది రోజుల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన ఇద్దరు క్రికెటర్లు తిరిగి జట్టులో స్థానం కల్పించటమే అత్యంత ప్రత్యేకం.
ఏప్రిల్ 18 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. తదుపరి టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగే ఈ సిరీస్ చాలా కీలకంగా మారనుంది.ఎందుకంటే ఈ సీరీస్ ప్రభావం తర్వాత జూన్ లో జరిగే టీ 20 ప్రపంచ వరల్డ్ కప్ పైనే కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇద్దరి ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ అభిమానుల దృష్టి ఉంది.వారు గతంలో ఒకరు ఫిక్సింగ్ ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన ఒక వ్యక్తి మరొకరు పాకిస్థాన్ ఫీమియర్ లీగ్ లో సిగిరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కిన ఆటగాడు
న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ప్రకటించిన జట్టులో మహ్మద్ అమీర్, ఇమాద్ వసీం పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరు క్రికెటర్లు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ టీమ్‌లో ఈ ఇద్దరు క్రికెటర్లు ఉండాలని కెప్టెన్ బాబర్ ఆజం కోరుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే న్యూజిలాండ్‌పై వారి ప్రదర్శన ఆధారంగా టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరి ఎంపిక ఉంటుంది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అమీర్, ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రీది . మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్.