Retail Inflation: మూడునెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం.. ప్రభుత్వ లెక్కలు విడుదల..

ప్రభుత్వం జనవరి 2024కు సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కలు విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1%గా ఉంది. ఇది సెప్టెంబర్ 2023 లో నమోదైన 5.02% కంటే, కొద్దిగా ఎక్కువ. ఆహార పదార్ధాల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం తగ్గింది. 

New Update
Retail Inflation: మూడునెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం.. ప్రభుత్వ లెక్కలు విడుదల..

Retail Inflation: భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి 2024లో 5.1%కి తగ్గింది. మూడు నెలల్లో ఇదే కనిష్ఠ స్థాయి ద్రవ్యోల్బణం కావడం గమనార్హం.  అంతకుముందు డిసెంబర్ 2023లో ద్రవ్యోల్బణం 5.69%. నవంబర్‌లో 5.55%, అక్టోబర్‌లో 4.87%, సెప్టెంబర్‌లో 5.02%గా ఉంది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గింది. డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. జనవరిలో కూరగాయల ద్రవ్యోల్బణం 27.6% నుంచి 27%కి తగ్గింది. మరోవైపు, ఇంధనం అలాగే విద్యుత్ ద్రవ్యోల్బణం రేటు -0.60%, ఇది డిసెంబర్‌లో -0.77%గా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద ఉంచాలనే RBI లక్ష్యం. ద్రవ్యోల్బణం వివరాలివి.. 

  • ఆహార ద్రవ్యోల్బణం 9.5 శాతం నుంచి 8.3 శాతానికి తగ్గింది.
  • గ్రామీణ ద్రవ్యోల్బణం 5.93% నుంచి 5.34%కి తగ్గింది.
  • పట్టణ ద్రవ్యోల్బణం రేటు 5.46% నుండి 4.92%కి తగ్గింది

ద్రవ్యోల్బణం ఎలా ప్రభావితం చేస్తుంది?
ద్రవ్యోల్బణం (Retail Inflation)నేరుగా కొనుగోలు శక్తికి సంబంధించినది. ఉదాహరణకు, ద్రవ్యోల్బణం రేటు 6% అయితే, సంపాదించిన రూ. 100 విలువ కేవలం రూ.94 మాత్రమే ఉంటుంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పెట్టుబడి పెట్టాలి. లేదంటే మీ డబ్బు విలువ తగ్గిపోతుంది.

ద్రవ్యోల్బణం తగ్గడం.. పెరగడం ఎలా జరుగుతుంది?
ద్రవ్యోల్బణం (Retail Inflation0పెరగడం.. తగ్గడం అనేది ప్రొడక్షన్ డిమాండ్ - సరఫరాపై ఆధారపడి ఉంటుంది. ప్రజల వద్ద ఎక్కువ డబ్బు ఉంటే వారు ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది.  డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోతే, ఈ వస్తువుల ధర పెరుగుతుంది. ఈ విధంగా మార్కెట్ ద్రవ్యోల్బణానికి గురవుతుంది. ఇంకా సరళంగా చెప్పాలంటే, అధిక డబ్బు ప్రవాహం లేదా మార్కెట్లో వస్తువుల కొరత ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అయితే డిమాండ్ తక్కువగా ఉండి సరఫరా ఎక్కువగా ఉంటే ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది.

ద్రవ్యోల్బణం CPI ద్వారా.. 
వినియోగదారులుగా.. మనం అందరం..  రిటైల్ మార్కెట్ నుండి వస్తువులను కొనుగోలు చేస్తాము. దీనికి సంబంధించిన ధరలలో మార్పులను చూపించే పనిని వినియోగదారు ధర సూచిక అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) చేస్తుంది. వస్తువులు, సేవలకు మనం చెల్లించే సగటు ధరను CPI కొలుస్తుంది.

Also Read:  ఇది షాకింగ్.. ఎక్కువ పన్ను కడుతున్నది కార్పొరేట్లు కాదు.. ఎవరంటే.. 

ముడి చమురు, వస్తువుల ధరలు, తయారీ ఖర్చులు కాకుండా, రిటైల్ ద్రవ్యోల్బణ(Retail Inflation) రేటును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అనేక అంశాలు ఉన్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం రేటును నిర్ణయించే ధరల ఆధారంగా దాదాపు 300 వస్తువులు ఉన్నాయి.

డిసెంబర్‌లో ఐఐపి వృద్ధి 3.8%..
పారిశ్రామికోత్పత్తి సూచీ డిసెంబర్ గణాంకాలు అంటే ఐఐపి కూడా విడుదలయ్యాయి. నవంబర్‌లో 2.4 శాతం ఐఐపీ వృద్ధితో పోలిస్తే డిసెంబర్‌లో ఐఐపీ వృద్ధి 3.8 శాతంగా నమోదైంది. సర్వేలో, బ్లూమ్‌బెర్గ్ ఆర్థికవేత్తలు డిసెంబర్‌లో IIP వృద్ధిని 2.5%గా అంచనా వేశారు.  అయితే గణాంకాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నాయి. IIP నెలవారీగా పెరిగింది, కానీ వార్షిక ప్రాతిపదికన తగ్గింది. డిసెంబర్ 2022లో IIP రేటు 5.1%గా ఉంది. 

Watch this Interesting Video :

Advertisment
తాజా కథనాలు