Shiva Bala Krishna: ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఆస్తులపై కొనసాగుతున్న విచారణ

రెరా కార్యర్శి శివ‌బాల‌కృష్ణపై స‌స్పెన్షన్‌ వేటు ప‌డింది. అతడిని స‌స్పెండ్‌ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌నర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవ‌ల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

author-image
By Naren Kumar
New Update
Shiva Bala Krishna: ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. ఆస్తులపై కొనసాగుతున్న విచారణ

Shiva Bala Krishna: రెరా కార్యర్శి శివ‌బాల‌కృష్ణపై స‌స్పెన్షన్‌ వేటు ప‌డింది. అతడిని స‌స్పెండ్‌ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌నర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవ‌ల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్‌ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడాయన చంచ‌ల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారిగా కూడా శివబాలకృష్ణ గతంలో పనిచేశారు.

ఇది కూడా చదవండి: జార్ఖండ్‌ సీఎంగా కల్పనా సోరెన్‌?.. హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ఖాయం!

శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారం, వజ్రాలతో కూడిన భరణాలతో పాటు దాదాపు 6 కిలోల వరకూ వెండి నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను గుర్తించారు. సోదాల్లో లభించిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారమే రూ.8,26,48,999 ఉంటాయని, అయితే, మార్కెట్‌లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సంగీతం టీచర్‌ డ్రగ్స్ దందా.. వీఐపీలతోనే సంబంధాలు

అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ ఎక్కువగా భూములు కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌ శివార్లతోపాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామల్లో వాటిని గుర్తించారని సమాచారం. దీంతోపాటు కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించి పరిశీలనలు జరుగుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు