Renu Desai: రేణు దేశాయ్ .. ఈ నటి గురించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రేణు దేశాయ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్, యాక్టర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు. రేణుదేశాయ్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తనకు చిన్నప్పటి నుంచి గుండె సంబందిత సమస్య ఉన్నట్లు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రేణు దేశాయ్ 2003 లో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన బద్రి (Badri) సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన రేణుదేశాయ్.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ప్రేమ వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికీ అఖీరా (Akira Nandan), ఆద్య (Aadya) ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కొంత కాలానికి పలు కారణాల చేత వీళ్లిద్దరు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా రేణుదేశాయ్ మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో మళ్ళీ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతుంది.
రేణుదేశాయ్ ఇటీవలే టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao) సినిమాకు సంబంధించి ఓ ఇంట్వ్యూ లో తన గుండె సమస్య గురించి అడగగా..తను చిన్నప్పటి నుంచి గుండె సమస్యతో భాదపడుతున్నాని, ఇది జన్యుపరమైన సమస్య దీనిని 'మయోకార్డియల్ బ్రిజింగ్' అంటారని చెప్పింది. అయితే ఈ సమస్య వల్ల ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసంగా అనిపించడం, చెమటలు పట్టడం, హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అనిపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటూ మందులు వాడుతున్నాని చెప్పారు.
20 ఏళ్ళ తర్వాత రేణుదేశాయ్ మాస్ మహారాజ్ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో మళ్ళీ సినిమాల్లో కనిపించనుంది. ఇక పై కూడా తన పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.
Also Read: Bigg Boss 7 Telugu: కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ..అర్జున్ స్ట్రాటజీ సూపర్