Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తెరంగేట్రంపై రేణు దేశాయ్ స్పందించారు. మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతో పాటు స్క్రిప్ట్ రైటింగ్‌పై అకీరా దృష్టి పెట్టాడని, నటన వైపు వెళ్లాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని తెలిపారు. తాను లేదా పవన్ కల్యాణ్ కూడా నటుడిగా మారమని అకీరాను బలవంతం చేయడం లేదని చెప్పారు.

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?
New Update

Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) అకీరా(Akira Nandan) తెరంగేట్రంపై రేణు దేశాయ్(Renu Desai) స్పందించారు. మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతో పాటు స్క్రిప్ట్ రైటింగ్‌పై అకీరా దృష్టి పెట్టాడని, నటన వైపు వెళ్లాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని తెలిపారు. తాను లేదా పవన్ కల్యాణ్ కూడా నటుడిగా మారమని అకీరాను బలవంతం చేయడం లేదని చెప్పారు. తాజగా టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె.. తన కుమారుడు అకీరా నందన్ గురించి ఈ కామెంట్స్ చేసింది.

వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటి రేణు దేశాయ్ వెండితెరకు రీ-ఎంట్రీ ఇస్తున్నారు. 1970లలో స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రేణు దేశాయ్.. గుర్రం జాషువా కూతురు, సామాజికవేత్త హేమలత లవణంగా కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడంపై, ఈ సినిమాలో నటించడంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

publive-image

సినిమా కథ, దర్శకుడు, నిర్మాత వల్ల తాను రీఎంట్రీ ఇచ్చినట్లు చెప్పారు. హేమలత లవణం పాత్రలో నటించేందుకు తాను మొదట భయపడ్డానన్నారు. ఈ పాత్రకు తాను వంద శాతం న్యాయం చేయగలనా? అనే అనుమానం వచ్చిందన్నారు. వంశీతో పాటు సినిమా టీమ్ మద్దతుతో ఇది సాధ్యమైందన్నారు. ఏ జన్మలో చేసిన పుణ్యం వల్లో ఈ సినిమాలో తనకు అవకాశం దక్కిందని చెప్పారు. తన పోస్టర్ చూశాక తన తనయుడు అకీరా ఎంతో సంతోషించాడన్నారు. చాలామంది నటీనటులు తమ వయస్సుకు తగినట్లుగా నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని అన్నారు. తాను మాత్రం అందుకు ఎంతో గర్విస్తున్నానన్నారు.

Renu Desai

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అకీరా తెరంగేట్రంపై రేణు దేశాయ్ స్పందించారు. మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతో పాటు స్క్రిప్ట్ రైటింగ్‌పై అకీరా దృష్టి పెట్టాడని, నటన వైపు వెళ్లాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని తెలిపారు. తాను లేదా పవన్ కల్యాణ్ కూడా నటుడిగా మారమని అకీరాను బలవంతం చేయడం లేదని చెప్పారు.

publive-image

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్.. హీరోగా ఎంట్రీ ఇస్తే బాగుండు అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ వారసుడిగా అకీరాను స్క్రీన్ పై చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. అయితే ఇప్పటికే రేణు దేశాయ్.. తన కుమారుడు హీరో కాడంటూ చెప్పుకువచ్చింది.

Also Read: ఆ సంస్ధకు అప్పు చెల్లించని హీరో విశాల్..!!

#pawan-kalyan #renu-desai-about-akira
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe