Renu Desai: వరుణ్ వివాహానికి ఆహ్వానం.. రేణు దేశాయ్ కీలక ప్రకటన

మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి.. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి వేడుకల కోసం ఇటలీ చేరుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నెవా తో కలిసి ఇటలీ వెళ్లారు. ఇక రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆద్య ఈ పెళ్లి వేడుకల కోసం వెళ్లినట్లుగా ఎక్కడా కనిపించలేదు. దీంతో రేణు దేశాయ్ కుటుంబం పెళ్లి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు స్పందించిన రేణు దేశాయ్ ఇలా అన్నారు..

New Update
Renu Desai: వరుణ్ వివాహానికి ఆహ్వానం.. రేణు దేశాయ్ కీలక ప్రకటన

Renu Desai: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి సంబరాల్లో బిజీగా ఉన్నారు. వరుణ్, లావణ్య పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో చాలా గ్రాండ్ గా జరగనుంది. ఇక వీళ్ల పెళ్లి కోసం మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకున్నారు. పెళ్లి వేడుకల కోసం వెళ్లిన మెగా కుటుంబం అక్కడ హాలీడేను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

publive-image

ఈ పెళ్లి వేడుకలకు మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు. ఇంతకు ముందు రాజస్థాన్ లో జరిగిన నిహారిక పెళ్లి వేడుకలను కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి  చాలా ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్.. కొడుకు అకీరా, కూతురు ఆద్యను కూడా  తీసుకెళ్లాడు. కానీ వరుణ్, లావణ్య పెళ్లి విషయంలో మాత్రం ఇలాంటిదేమీ జరగలేదు. దీంతో రేణు దేశాయ్ కుటుంబం ఈ పెళ్ళికి దూరంగా ఉన్నట్లుగా  సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపించాయి. అంతే కాదు తాజాగా పవన్ కళ్యాణ్ వరుణ్ పెళ్లి వేడుకల కోసం భార్య అన్నా లెజ్నెవా తో కలిసి ఇటలీ వెళ్లారు.

publive-image

ఇక రేణుదేశాయ్  వరుణ్ పెళ్లి విషయంలో వస్తున్న వార్తల పై స్పందిస్తూ.. తాను నిహారిక పెళ్ళికి కూడా వెళ్లలేదని.. పిల్లల్ని మాత్రం పంపించానని చెప్పుకొచ్చింది. వరుణ్ చిన్నప్పుడు నా కళ్ళ ముందే పెరిగాడు.. తనకు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని.. తాను పెళ్ళికి వెళితే అందరికీ కాస్త అన్ కంఫర్టబుల్‌గా ఉండే  అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఈ సారి ఇటలీలో జరగబోయే వరుణ్, లావణ్య పెళ్ళికి అకీరా, ఆద్య వెళ్ళనట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రేణుదేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్నారు.

publive-image

Also Read: Varun,Lavanya Marriage: ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లి ఫోటోలు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు