Kitchen tips: సాధారణంగా ప్రతి వంటగది టైల్స్ జిడ్డుగా ఉన్నాయా. నాలుగు చిట్కాలను ఉపయోగించి మీ వంటగదిని మెరిసేలా చేయచ్చు. టైల్స్ జిడ్డుగా ఉన్నాయా..? అయితే ఎందుకు అలస్యం ఈ చిట్కాలను ఉపయోగించి మెరిసేలా చేయండి. కిచెన్ టైల్స్ నుంచి మొండి మరకలను తొలగించడానికి అ చిట్కాలలో త్వరితగతిన ఈ మరకలను తొలగిస్తాయి. ఇప్పుడు అవి ఏంటో చూద్దాం.
బేకింగ్ సోడా: కిచెన్ టైల్స్ లేదా గోడల నుంచి జిగట నూనె మరకలను తొలగించడానికి బేకింగ్ సోడా మంచి పరిష్కారం. దీని కోసం, బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్‌ను మరక ఉన్న దగ్గర రాసి 15 నుంచి 20 నిమిషాల ఉంచాలి. తర్వాత శుభ్ర చేసి నీటితో గోడపై పేస్ట్‌ను తుడవండి. ఇలా చేస్తే గోడ మీద మరకలు కనిపించవు.
వెనిగర్: వంటగదిలో మొండి మరకలను తొలగించడంలో వెనిగర్ బెస్ట్ అని చెప్పాలి. గోడ నుంచి నూనె మరకలను తొలగించడానికి, వెనిగర్, నీటిని సమాన భాగాలుగా తీసుకుని, ఆపై స్పాంజ్ లేదా గుడ్డతో నూనె మరకలు పెట్టాలి.. ఇలా 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై తడి గుడ్డతో పూర్తిగా తుడిస్తే మరలు మారం అవుతాయి.
లిక్విడ్ డిష్‌వాష్: టైల్స్, గోడల నుంచి మరకలను తొలగించడానికి చౌకైన పరిష్కారం లిక్విడ్ డిష్‌వాష్. ఈ లిక్విడ్ డిష్‌వాష్‌ను స్టెయిన్‌కు రాయాలి. గోడపై ఒక గంట పాటు వదిలేసి... తర్వాత ఒక క్లీన్ క్లాత్‌తో లిక్విడ్ డిష్ వాష్‌ను గోడపై తుడిస్తే మరలు పోతాయి.
ఉప్పు: వంటలో రుచిగా వండటానికి మాత్రమే కాదు. వంటగది మెరుపుని తెస్తుంది. నూనె మరకలను తొలగించడానికి ఉప్పు చల్లుకోండి ఉప్పు నూనె మరకలను గ్రహిస్తుంది తర్వాత ఈ స్థలంలో వెనిగర్‌ను స్ప్రెడ్ చేసి మంచి గుడ్డతో శుభ్రం చేస్తే మరకలు పోతాయి.
వేడి: గోడపై ఉన్న నూనె మరకలు వేడితో కరిగిపోతాయి.
ప్రతిరోజూ కిచెన్ టైల్స్ క్రమ వ్యవధిలో శుభ్రం చేసుకోవాలి. మరకలు ఎక్కువ కాలం ఉండకూడదనుకుంటే, వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే మరకలు ఉండవు. రోజు వంటగదిలో వంట చేయడం వల్ల టైల్స్, గోడలపై జిడ్డు మరకలు ఎక్కువ అవుతాయి. వీటిని సకాలంలో తొలగించకపోతే, ఈ మరకలు మొండిగా మారతాయి. అంతేకాకుండా తొలగించడానికి చాలా శ్రమ పట్టింది. కానీ.. ఇప్పుడు కిచెన్ టైల్స్‌పై మొండి మరకలను శుభ్రపరిచే టెన్షన్ అవసరం లేదు. ఈ సింపుల్ చిట్కాలతో ఈ మరకలు తొలగిపోతాయి.
ఇది కూడా చదవండి: మధుమేహం ఉన్నవారు పాలు, పెరుగు తింటే ఏమవుతుంది..వైద్యులు ఏమంటున్నారు..?