Home Tips: దుప్పట్లు బాగా వాసన వస్తున్నాయా?.. ఈ రెమెడీలు పాటించండి

బ్లాంకెట్‌లను ఎక్కువగా ఉపయోగిచేవారు ఉతకకుంటే అనేక రకాల బ్యాక్టీరియాలు దుప్పట్లో ఉంటాయని నిపుణులు అంటున్నారు. కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా దుప్పట్ల వాసనను సులభంగా పోగొట్టవచ్చు. దుప్పటిలో కర్పూరం కట్ట వేసి 5 నుంచి 6 గంటల తరువాత బహిరంగ ప్రదేశంలో ఆరబెడితే ఫలితం ఉంటుంది.

New Update
Home Tips: దుప్పట్లు బాగా వాసన వస్తున్నాయా?.. ఈ రెమెడీలు పాటించండి

Home Tips: ఏ కాలంలోనైనా బ్లాంకెట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉతికేందుకు కూడా టైమ్‌ ఉండదు. దీనివల్ల అనేక రకాల బ్యాక్టీరియాలో దుప్పట్లో తిష్టవేసుకుని కూర్చుంటాయి. అంతేకాకుండా దుప్పట్లు బాగా దుర్వాసన వస్తుంటాయి. కొన్ని చిట్కాలతో దుప్పట్లను శుభ్రం చేసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు. దుప్పట్ల వాసన పోగొట్టే కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దుప్పటి వాసనను పోగొట్టే చిట్కాలు:

  • ప్రతీ ఇంట్లో దుప్పట్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రజలు రోజంతా దుప్పట్లు కప్పుకుని ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో దుప్పటి నుంచి దుర్వాసన రావడం సహజం. దుప్పట్లు చాలా బరువుగా ఉంటాయి. దుప్పట్లు ప్రతిరోజూ ఉతకలేరు. అటువంటి పరిస్థితిలో వాసన పోగొట్టాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి.

కర్పూరం వాడితే దుప్పటి వాసన పోతుంది:

  • కర్పూరాన్ని ఉపయోగించడం ద్వారా దుప్పట్ల వాసనను సులభంగా పోగొట్టవచ్చు. ఇందుకోసం ముందుగా కర్పూరాన్ని పేపర్‌లో చుట్టి 5 నుంచి 6 కట్టలను తయారు చేయాలి. దుప్పటిలో కర్పూరం కట్ట వేసి 5 నుంచి 6 గంటలపాటు అలాగే ఉంచాలి. 5-6 గంటల తరువాత దుప్పటిని కొంత సమయం పాటు బహిరంగ ప్రదేశంలో ఆరబెట్టండి. ఇలా చేయడం వల్ల దుప్పటిలో దుర్వాసన పోతుంది.

బేకింగ్ సోడా:

  • బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల దుప్పటి నుంచి వచ్చే వాసనను సులభంగా తొలగించవచ్చు. దీని కోసం దుప్పటిపై బేకింగ్ సోడాను చల్లాలి. ఆ తర్వాత 7 నుంచి 8 గంటలు అలాగే ఉంచండి. బేకింగ్ సోడా దుప్పటిలో ఉన్న దుర్వాసనను పోగొడుతుంది. ఆ తర్వాత దుప్పటి నుంచి బేకింగ్ సోడాను తొలగించడానికి మీరు వాక్యూమ్‌ని ఉపయోగించవచ్చు.

ఆయిల్‌తో దుర్వాసన మాయం:

  • ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించి దుప్పటి వాసనను సులభంగా తొలగించుకోవచ్చు. దీని కోసం మీకు నచ్చిన నూనెను ఉపయోగించవచ్చు. దుప్పటిని పరిచి నూనెను చల్లుకోవాలి. దాని వల్ల దుర్వాసన పోవడమే కాకుండా దుప్పటి కూడా శుభ్రంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మంచి నిద్ర కోసం ఎలాంటి దిండ్లను ఉపయోగించాలి?.. ఇలాంటివి వాడితే అనారోగ్యం తప్పదు

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు